Love Story Movie: ‘ఉప్పెన’ కి ఉన్న అడ్వాంటేజులు ‘లవ్ స్టొరీ’ కి ఉండి ఉంటే రూ. 100 కోట్లు కొట్టేదట..!

కరోనా ఫస్ట్ వేవ్ మొదలైనప్పటి నుండీ ఉప్పెన, లవ్ స్టొరీ సినిమాల్లోని పాటలు మనల్ని రంజింపజేయడం మాత్రమే కాకుండా ఈ సినిమాలను ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆసక్తిని రేకెత్తించాయి. ఫస్ట్ వేవ్ ముగిసిన వెంటనే ఉప్పెన విడుదలైంది బ్లాక్ బస్టర్ అయ్యింది. వైష్ణవ్ తేజ్ డెబ్యూ మూవీనే రూ.52 కోట్ల వరకు షేర్ ను వసూల్ చేసింది. గ్రాస్ పరంగా రూ.90 కోట్ల వరకు వసూల్ చేసింది. ఇక లవ్ స్టోరీ సెకండ్ వేవ్ తర్వాత ఈ మధ్యనే రిలీజ్ అయ్యింది.

మొదటిరోజు పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ ను కూడా సాధించింది. కాకపోతే సోషల్ మీడియాలో లవ్ స్టొరీ కలెక్షన్లను .. ఉప్పెన కలెక్షన్లతో పోల్చి తక్కువ చేస్తున్నారు కొందరు నెటిజన్లు. నిజానికి ఉప్పెన చిత్రం 100 శాతం సీటింగ్ కెపాసిటీ తో రిలీజ్ అయ్యింది. అలాగే అప్పటికి టికెట్ రేట్లు కూడా ఎక్కువ. కరోనా భయం అప్పటికి పూర్తిగా జనాల్లో పోయింది. కానీ లవ్ స్టోరీ విషయంలో అలా కాదు.

గత వారం విడుదలైన ఈ చిత్రం ఉప్పెన తో పోల్చుకుంటే తక్కువ దియేటర్లలో విడుదల అయ్యింది. టికెట్ రేట్లు కూడా తక్కువ. పైగా ఆంధ్రాలో 50 శాతం సీటింగ్ కెపాసిటీ తోనే రిలీజ్ అయ్యింది. ఇంకో పక్క వర్షాలు కూడా..! వీటన్నిటినీ తట్టుకుని ఈ సినిమా బాగానే నిలబడుతుంది. ఉప్పెన కి ఉన్న అడ్వాంటేజ్ లు కనుక లవ్ స్టోరీకి ఉండి ఉంటే కనుక మొదటి వారం ముగిసెలోపే రూ.100 కోట్ల గ్రాస్ ను వసూల్ చేసి ఉండేది అని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus