మాస్ మహారాజా రవితేజ స్టార్ గా ఎదగడానికి పరోక్షంగా పవన్ కళ్యాణ్ కారణమని చాలా మంది అంటుంటారు. అందుకు కారణం కూడా అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ కోసం అనుకున్న కథలు రవితేజకి వెళ్లడం అతను చేయడం.. స్టార్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా దర్శకుడు పూరీ జగన్నాథ్ పవన్ కళ్యాణ్ కోసం `ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం` (2001), `ఇడియట్` (2002) `అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి` (2003) చిత్రాల కథల్ని రెడీ చేసుకున్నాడు.
కానీ ఈ 3 సినిమాలను పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేసాడు. అదే టైములో అతనికి నచ్చిన సినిమాల్ని చేసి ప్లాపుల్ని మూటగట్టుకున్నాడు పవన్ కళ్యాణ్. అన్నీ ఏమో కానీ ‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’ చిత్రాన్ని పవన్ రిజెక్ట్ చేయడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ముందుగా ఇది కిక్ బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన మూవీ. ఆల్రెడీ ఇలాంటి కథాంశంతో కూడుకున్న సినిమాని పవన్ చేసాడు. అదే ‘తమ్ముడు’ మూవీ. దీనికి మొదట నెగిటివ్ టాక్ వచ్చింది.
కానీ కామెడీ క్లిక్ అవ్వడంతో తర్వాత పుంజుకుని బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యింది. ఇక రెండో కారణం.. ఈ టైటిల్ కానీ.. సినిమాలో ఉన్న ఎమోషన్ కు కానీ తన ఇమేజ్ సెట్ అవ్వదని పవన్ చెప్పాడట. అయినప్పటికీ కొన్నాళ్ళు హోల్డ్ లో పెట్టిన పవన్ కళ్యాణ్ చివరికి నేను చేయలేను అని చెప్పేశాడట. తర్వాత ఇది రవితేజ చేయడం. వీరి కాంబినేషన్లో హ్యాట్రిక్ పూర్తవ్వడం.. జరిగింది.
2003 వ సంవత్సరం ఏప్రిల్ 19న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.17 కోట్ల వరకు షేర్ ను రాబట్టింది. 55 కేంద్రాల్లో డైరెక్ట్ గా 100 రోజులు ఆడింది ఈ మూవీ. నేటితో ఈ చిత్రం విడుదలై 19 వసంతాలు పూర్తిచేసుకోవడం విశేషం. అయితే ఈ మూవీలో పవన్ కళ్యాణ్ నటిస్తే ఎలా ఉండేది.. ఇంకెంత పెద్ద హిట్ అయ్యేది అనే ఆలోచన అందరిలోనూ మెదులుతూనే ఉంటుంది.