The Warriorr Collections: 11వ రోజు థాంక్యూ కంటే ఎక్కువ కలెక్ట్ చేసింది… కానీ

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నటించిన బై లింగ్యువల్ మూవీ ‘ది వారియర్’. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించారు.దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. ఆది పినిశెట్టి విలన్ గా నటించాడు. మొదటి రోజు ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ మంచి ఓపెనింగ్స్ ను నమోదు చేసింది ఈ మూవీ.

అయితే వీక్ డేస్ లో పెద్దగా రాణించలేకపోయింది అనే చెప్పాలి.ఓవరాల్ గా మొదటి వారం యావరేజ్ కలెక్షన్లతో సరిపెట్టిన ఈ మూవీ రెండో వీకెండ్ ను ను క్యాష్ చేసుకునే అవకాశం ఉన్నా క్యాష్ చేసుకోలేకపోతుంది. ‘ది వారియర్’ 11 డేస్ కలెక్షన్స్ ను ఓసారి గమనిస్తే :

నైజాం 5.72 cr
సీడెడ్ 3.12 cr
ఉత్తరాంధ్ర 2.44 cr
ఈస్ట్ 1.36 cr
వెస్ట్ 1.18 cr
గుంటూరు 1.99 cr
కృష్ణా 0.99 cr
నెల్లూరు 0.67 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 17.47 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 1.08 cr
తమిళనాడు 1.30 cr
ఓవర్సీస్ 0.70 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 20.55 cr

‘ది వారియర్’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.38.99 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.40 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి.11 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.20.55 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.19.45 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

మొదటి వారం యావరేజ్ పెర్ఫార్మన్స్ ఇచ్చిన ‘ది వారియర్’ రెండో వీకెండ్ ను క్యాష్ చేసుకుంటుందేమో అనుకుంటే అలా జరగలేదు కానీ, నిన్నతే ఈ చిత్రం కొత్తగా రిలీజ్ అయిన థాంక్యూ కంటే ఎక్కువగా కలెక్ట్ చేసింది.

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus