బాహుబలి 2 రిలీజ్ తేదీలో మార్పే లేదు!

నాణ్యత కోసం ఎంత రిస్క్ అయినా తీసుకునే దర్శకుల్లో ఎస్.ఎస్.రాజమౌళి ముందుంటారు. భారీ బడ్జట్ తో మూడేళ్లుగా శ్రమిస్తున్న బాహుబలి చిత్రం విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు. మొదటి పార్ట్ కంటే రెండో పార్ట్ ఇంకా బాగా ఉండాలని ప్రీ ప్రొడక్షన్ దశ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వరకు పక్క ప్లాన్ తో ముందుకు సాగుతున్నారు. ఆరు నెలల ముందే బాహుబలి కంక్లూజన్ విడుదల తేదీని ప్రకటించి బిజినెస్ నెస్ ని మొదలు పెట్టారు.

ఒక్కోరోజు ఒక్కో ఏరియా హక్కులను విక్రయిస్తూ చిత్రం రిలీజ్ కి ముందే నిర్మాతలకు లాభాలను అందిస్తున్నారు. ఈ సందర్భంగా రిలీజ్ తేదీలో ఏమైనా మార్పులు ఉంటాయా ? అని డిస్ట్రిబ్యూటర్లు దర్శక ధీరుడిని అడిగారని, అందుకు ఆయన  రిలీజ్ తేదీలో మార్పే లేదని స్పష్టంగా చెప్పినట్లు సమాచారం. బాహుబలి 2 చిత్రం ఫస్ట్ లుక్, టీజర్, సినిమా రిలీజ్ .. ప్రతి ఒక్కటి చెప్పిన సమయానికి జరిగేలా రాజమౌళి తన బృందానికి డెడ్ లైన్ పెట్టినట్లు తెలిసింది.

నెల ముందే రెండు పాటలు మినహా సినిమా మొత్తం షూటింగ్ ఫుటేజ్ ని ఎడిటింగ్ చేసి గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ కోసం మూడు టెక్నకల్ టీమ్స్ కి అందజేశారని చిత్ర బృందం వెల్లడించింది. ఇక ప్రభాస్, అనుష్కలపై చిత్రించే పాటలకు ఎడిటింగ్ మాత్రమే ఉంటుందని అందుకోసం గ్రాఫిక్స్ అవసరం లేదని వివరించింది. సో.. ఏప్రిల్ 28, 2017 న ప్రపంచవ్యాప్తంగా బాహుబలి కంక్లూజన్ రిలీజ్ అవుతుందనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus