దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి అనగానే ‘రాజేంద్రుడు గజేంద్రుడు’, ‘యమలీల’, ‘శుభలగ్నం’, ‘నెంబర్ వన్’, ‘ఘటత్కోచుడు’, ‘వినోదం’, ‘మావిచిగురు’, ‘ఎగిరే పావురమా’ ‘పెళ్ళాం ఊరెళితే’, ‘హంగామా’ వంటి సినిమాలు గుర్తొస్తాయి. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడం మాత్రమే కాదు.. ఇప్పటికీ టీవీల్లో చూస్తే ఇవి మంచి టైం పాస్ మూవీస్ లా అనిపిస్తాయి.అంతేకాదు కృష్ణారెడ్డి విజనరీ డైరెక్టర్ అనే ఫీలింగ్ ను కూడా కలిగిస్తాయి.1990ల్లో ఈవీవీతో పాటు ఈయన కూడా సమాంతరమైన క్రేజ్ ను ఎంజాయ్ చేస్తుండేవారు.
స్టార్ ప్రొడ్యూసర్స్ ఎగబడి ఈయనకు అడ్వాన్స్ లు ఇచ్చి సినిమాలు చేయించుకునేవారు. కృష్ణారెడ్డి అంటే మినిమమ్ గ్యారంటీ అనే డైరెక్టర్ అని అంతా భావించారు. నిర్మాతకు చెప్పిన బడ్జెట్ లో సినిమా తీసి చాలా లాభాలు అందించేవారు. ఏదేమైనా అటు ప్రేక్షకులకు.. ఇటు నిర్మాతలకు కూడా కృష్ణారెడ్డి సినిమా అంటే మంచి క్రేజ్ ఉండేది. కానీ కొత్త డైరెక్టర్ల ఎంట్రీతో ఈయన ఫేడౌట్ అయిపోయారు. అయితే ఏళ్ళ తర్వాత ‘ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు’ అనే చిత్రాన్ని కృష్ణారెడ్డి డైరెక్ట్ చేస్తూ రీ ఎంట్రీ ఇస్తున్నారు అంటే..
జనాల్లో ఎంతో కొంత ఆసక్తి నెలకొంటుంది. ‘ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు’ సినిమా పై కూడా అలాంటి అంచనాలు ఏర్పడ్డాయి. మొదటి రోజు సినిమాకి ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా సినిమా నిలబడేది. కానీ సినిమా చూశాక కృష్ణారెడ్డి ఏమీ మారలేదు అని స్పష్టమవుతుంది. కృష్ణారెడ్డి సినిమాలను అభిమానించేవారు కూడా తిట్టుకుంటే థియేటర్ నుండి బయటకు వెళ్లారని చెప్పొచ్చు. వయసు పెరిగేకొద్దీ ఆలోచనలు కూడా పాతపడతాయి.
అలాంటప్పుడు బుర్రా సాయి మాధవ్ వంటి కొత్త రైటర్లను పెట్టుకుని వారి సలహాలు తీసుకోవాలి. కానీ కృష్ణారెడ్డి ఈ విషయాలలోనే కక్కుర్తి పడుతూ ఉంటాడు. కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, మ్యూజిక్ అన్నీ కృష్ణారెడ్డే చేసేశారు. ఈ విభాగాలకు కొత్తవారిని తీసుకున్నా..ఔట్పుట్ కొంచెం బెటర్ గా ఉండేది. పాత డైరెక్టర్లు కనుక ఎవరైనా రీ ఎంట్రీ ఇస్తే కృష్ణారెడ్డి ఈ సినిమా చేసిన మిస్టేక్స్ తో చాలా నేర్చుకోవచ్చనే చెప్పాలి.
ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!
స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!