Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ -7లోకి ఎంట్రీ ఇవ్వకుండా వెనక్కి తిరిగిన 6 సెలబ్రిటీస్..!

బుల్లితెర పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ లో పాల్గొనడం చాలామంది సెలబ్రిటీలకు తీరని కల అలాంటిది వచ్చిన ఆఫర్ ని వదులుకున్నారు అంటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. చిన్న తరహా స్టార్స్ దగ్గర నుంచి సీరియల్ ఆర్టిస్టుల వరకు …ఇటు కొరియోగ్రాఫర్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టుల వరకు ఎందరో బిగ్ బాస్ షో కి వచ్చి తమ పాపులారిటీని విపరీతంగా పెంచుకున్నారు. మరోపక్క కొంతమంది ఉన్న క్రేజీ పోగొట్టుకొని లేనిపోని అపనిందలపాలు కూడా అయ్యారు.

ఈ విషయం పక్కన పెడితే ప్రస్తుతం అట్టహాసంగా మొదలైన (Bigg Boss 7 Telugu) బిగ్ బాస్ సీజన్ 7 కాస్త ఇంట్రెస్టింగ్గా ముందుకు సాగుతోంది. అయితే కొంతమంది మాత్రం చివరి నిమిషంలో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ కాకుండా కొన్ని కారణాల వల్ల పక్కకు తప్పుకున్నారట. బంగారం లాంటి అవకాశం వస్తే అంత మూర్ఖంగా వదులుకుంటారా..? అని డౌట్ వస్తోంది కదూ…మరి బిగ్ బాస్ 7 లో ఎంటర్ అవ్వకుండా లాస్ట్ మినిట్ లో ఎగ్జిట్ అయినా ఆ సెలబ్రిటీస్ ఎవరో ఒక లుక్ వేద్దామా…

సీరియల్ యాక్టర్ అంజలి పవన్ తన రెమ్యూనరేషన్ విషయంలో పేజీ రావడంతో చివరి నిమిషంలో బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టకుండా ఆగిపోయింది. మరోపక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా బాగా ఫేమస్ అయిన అనిల్ కూడా చివరి నిమిషంలో యాజమాన్యం హ్యాండ్ ఇవ్వడంతో బిగ్ బాస్ సీజన్ సెవెన్ కు దూరమయ్యాడు. ఇక జబర్దస్త్ కమెడియన్ నరేష్ సైతం ఈ సీజన్లో సందడి చేయాల్సి ఉంది…

అయితే ఈటీవీతో ఉన్న కాంట్రాక్ట్ పూర్తి కాకపోవడంతో బిగ్ బాస్ లోకి రాలేకపోయాడు. దాంతోపాటుగా నరేష్ కు అమెరికాలో పాల్గొనాల్సిన ఒక షో కూడా ఉందట. సీరియల్ నటి పూజా మూర్తి కూడా బిగ్బాస్ నుంచి తప్పుకోవడం జరిగింది. ఇక మొగలిరేకులు ఫేమ్ సాగర్, మహేష్ ఆచంట ఎంట్రీ ఖాయం అనుకుంటున్నప్పుడు ఆఖరి క్షణంలో షో నుంచి తప్పుకున్నారు.

మంది పార్టిసిపెంట్స్ తో దుమ్ము లేచిపోయిన బిగ్ బాస్ సీజన్ 7 స్టేజ్..!

సీజన్ – 7 లో 5 బ్లండర్ మిస్టేక్స్ ఇవే..!
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus