అరుదైన ఫీట్ సాధించిన హీరోయిన్లు వీళ్లే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో తండ్రీకొడుకులతో నటించిన హీరోయిన్ల సంఖ్య చాలా తక్కువనే సంగతి తెలిసిందే. అప్పటి జనరేషన్ లో ఈ రికార్డును అందుకున్న హీరోయిన్లు ఉన్నప్పటికీ ఇప్పటి జనరేషన్ లో మాత్రం ఈ రికార్డును అందుకోవడం అంత తేలిక కాదనే సంగతి తెలిసిందే. అయితే కొందరు హీరోయిన్లు మాత్రం తండ్రీకొడుకులతో ఆడిపాడటంతో పాటు విజయాలను సొంతం చేసుకున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా చరణ్ తో రచ్చ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.

ఈ హీరోయిన్ మెగాస్టార్ చిరంజీవితో కలిసి సైరా నరసింహారెడ్డి అనే సినిమాలో నటించారు. యంగ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి నాగ చైతన్యకు జోడీగా యుద్ధం శరణంలో హీరోయిన్ గా నటించడంతో పాటు నాగార్జునతో సోగ్గాడే చిన్నినాయన సినిమాలో నటించారు. మరో స్టార్ హీరోయిన్ రకుల్ నాగచైతన్యతో రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. నాగచైతన్యతో రకుల్ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర హిట్ కాగా రకుల్ నాగార్జునతో కలిసి నటించిన మన్మథుడు2 సినిమా మాత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది.

మన్మథుడు2 సినిమాలో రకుల్ పాత్రపై విమర్శలు వచ్చాయి. స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ చరణ్ కు జోడీగా మగధీర, నాయక్, గోవిందుడు అందరి వాడేలా, ఎవడు సినిమాల్లో నటించగా చిరంజీవికి జోడీగా ఖైదీ నంబర్ 150 సినిమాలో నటించడంతో పాటు కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో నటిస్తున్నారు. ఒకవైపు చిరంజీవి చరణ్ లతో కలిసి నటించిన ఈ హీరోయిన్ మరోవైపు నాగార్జున నాగచైతన్యలకు జోడీగా నటించడం గమనార్హం. నాగచైతన్యకు జోడీగా దడ సినిమాలో నటించిన కాజల్ నాగార్జునకు జోడీగా ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నారు.

1

2

3

4

5

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus