Baahubali Crown Of Blood: బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్ సిరీస్ విషయంలో ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే!

బాహుబలి (Baahubali) , బాహుబలి2 (Baahubali 2) బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి2 కలెక్షన్ల పరంగా సాధించిన రికార్డ్ బ్రేక్ కావాలంటే మరో పదేళ్ల సమయం పడుతుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్ సిరీస్ ఈరోజు నుంచి స్ట్రీమింగ్ అవుతుండటం గమనార్హం. ఈ సిరీస్ విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ నుంచి నెగిటివ్ కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఈ సిరీస్ బాగానే ఉన్నా ప్రభాస్  (Prabhas)  పాత్ర లుక్స్, తెలుగు వెర్షన్ డైలాగ్ డెలివరీ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోలేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. తెలుగు వెర్షన్ డబ్బింగ్ మరీ దారుణంగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. హిందీ వెర్షన్ విషయంలో తీసుకున్న జాగ్రత్తలు తెలుగు వెర్షన్ విషయంలో తీసుకుని ఉంటే బాగుండేదని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కట్టప్ప పాత్రను ముగించిన తీరు విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీజీఎం విషయంలో సైతం మేకర్స్ పూర్తిస్థాయిలో జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేదని చెప్పవచ్చు. అయితే బాహుబలి క్రేజ్ వల్ల ఈ సిరీస్ ఓటీటీలో హిట్ అయ్యే ఛాన్స్ అయితే ఉందని ఇందులో ఏ మాత్రం సందేహం అక్కలేదని ఫ్యాన్స్ చెబుతున్నారు. మరోవైపు ప్రభాస్ జక్కన్న (S. S. Rajamouli) కాంబోలో బాహుబలి3 రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

మహేష్ (Mahesh Babu) సినిమాకు జక్కన్న మరో మూడేళ్ల సమయం కేటాయించే ఛాన్స్ ఉంది. గత ఐదేళ్లలో జక్కన్న డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా ఆర్.ఆర్.ఆర్ (RRR) మాత్రమే అనే సంగతి తెలిసిందే. జక్కన్న వేగంగా సినిమాలను తెరకెక్కిస్తే మాత్రమే బాహుబలి3 సాధ్యమవుతుందని చెప్పవచ్చు. తర్వాత ప్రాజెక్ట్స్ విషయంలో రాజమౌళి నిర్ణయం ఏ విధంగా ఉండనుందో తెలియాల్సి ఉంది. బాహుబలి3 సినిమాను నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ తో తెరకెక్కించాలని ప్రభాస్ అభిమానులు కోరుకుంటున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus