కాంబినేషన్ హిట్టు.. రిజల్ట్ ఫట్టు అని ప్రూవ్ చేసిన 10 సినిమాలు..!

ఓ క్రేజ్ ఉన్న హీరో..ఓ క్రేజ్ ఉన్న డైరెక్టర్ కలిసి సినిమా చేస్తున్నారు అంటే దానికి హైప్ ఏ రేంజ్లో ఏర్పడుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ ప్రాజెక్టుకు సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్.. వంటివి బయటకొచ్చి ఆకట్టుకున్నాయి అంటే ఇక అప్పటివరకు ఉన్న హైప్ పీక్స్ కు వెళ్లడం ఖాయం. అలాంటి సినిమాలు మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంటాయి. కానీ ఒక్కసారి టాక్ నెగిటివ్ గా వచ్చింది అంటే ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద కోలుకోవడం కష్టమనే చెప్పాలి. అలా బ్లాక్ బస్టర్లు కొడతాయి అనుకున్న కాంబినేషన్లు డిజాస్టర్ అయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆ ప్రాజెక్టులు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

1) చెక్ :

నితిన్ – చంద్రశేఖర్ యేలేటి కాంబినేషన్ అనగానే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ అన్నీ సినిమా పై హైప్ క్రియేట్ చేశాయి. కానీ సినిమా ఆ స్థాయిలో లేకపోవడంతో రెండో రోజే దుకాణం సర్దేసింది.

2) చావు కబురు చల్లగా :

‘ఆర్.ఎక్స్.100’ హీరోకి ‘గీతా ఆర్ట్స్’ బ్యానర్లో ఓ సూపర్ హిట్ పడుతుంది అని ‘చావు కబురు చల్లగా’ ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పటి నుండి హోప్స్ పెరిగాయి. కానీ దర్శకుడు కౌశిక్ పెగళ్ళపాటి రిలీజ్ రోజున అవన్నీ అపోహలే అని ప్రూవ్ చేశాడు.

3) మహాసముద్రం :

‘ఆర్.ఎక్స్.100’ తో పెద్ద బ్లాక్ బస్టర్ అందుకున్న దర్శకుడు అజయ్ భూపతి.. శర్వానంద్- సిద్దార్థ్ లతో ఓ సినిమా చేస్తున్నాడు అంటే సహజంగానే భారీ అంచనాలు ఏర్పడతాయి. కానీ ఆ స్థాయిలో అయితే సినిమా లేదు. అందుకే డిజాస్టర్ అయ్యింది.

4) ఖిలాడి :

రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో వచ్చిన భారీ బడ్జెట్ మూవీ ‘ఖిలాడి’. ఫస్ట్ లుక్ నుండే భారీ అంచనాలు పెంచిన ఈ మూవీ రిలీజ్ రోజున మొదటి షోకే డిజాస్టర్ టాక్ ను మూటకట్టుకుంది.

5) ఆచార్య :

చిరంజీవి – రాంచరణ్ – కొరటాల శివ.. ఈ కాంబినేషన్ అనగానే డే 1 నుండే టాక్ తో సంబంధం లేకుండా రికార్డులు మోగిస్తుంది అని అంతా అనుకున్నారు. కానీ మొదటి రోజు ఈవెనింగ్ షోలకే థియేటర్లలో జనాలు లేరు అంటే ఈ మూవీ ఏ రేంజ్లో నిరాశపరిచిందో అర్థం చేసుకోవచ్చు.

6) పక్కా కమర్షియల్ :

గోపీచంద్ – మారుతి, యూవీ క్రియేషన్స్- గీతా ఆర్ట్స్.. ఈ కాంబినేషన్లో సినిమా అనగానే బ్లాక్ బస్టర్ తప్ప మరో ఆలోచన మైండ్లోకి రాదు. కానీ సినిమా ఆ స్థాయిలో ఫలితాన్ని అందుకోలేదు.

7) రామారావు ఆన్ డ్యూటీ :

టైటిల్ అనౌన్స్మెంట్ నుండే భారీ హైప్ ను సొంతం చేసుకున్న మూవీ ఇది.రవితేజ సినిమా కాబట్టి మినిమం గ్యారెంటీ అని అంతా అనుకున్నారు. కానీ సినిమా మాత్రం పెద్ద డిజాస్టర్ అయ్యింది.

8) ది వారియర్ :

రామ్ పోలీస్ ఆఫీసర్ రోల్ చేయడం దానికి లింగుస్వామి దర్శకుడు కావడం.. సినిమా సూపర్ హిట్ అని అంతా అనుకున్నారు. తమిళ్ లో కూడా రామ్ కు మంచి మార్కెట్ ఏర్పడుతుంది అని అంతా అనుకున్నారు. కానీ సినిమా ఆ స్థాయిలో లేదు.

9) థాంక్యూ :

విక్రమ్ కుమార్ దర్శకుడు, నాగ చైతన్య హీరో.. ఇది ‘మనం’ కాంబినేషన్. పైగా దిల్ రాజు నిర్మాత. సినిమా మినిమం గ్యారెంటీ అని అంతా అనుకున్నారు. కానీ మొదటి షోకే డిజాస్టర్ రిజల్ట్ ను మూటకట్టుకుంది.

10) లైగర్ :

విజయ్ దేవరకొండ- పూరి జగన్నాథ్ కాంబో. పైగా పాన్ ఇండియా మూవీ. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ కూడా ఓ నిర్మాత. సినిమా బ్లాక్ బస్టర్ అని టైటిల్ అనౌన్స్మెంట్ నుండి అనుకుంటూనే ఉన్నాం. కానీ తీవ్రంగా డిజప్పాయింట్ చేసింది ఈ మూవీ.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus