బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ తర్వాత ఓటింగ్ పోల్ అనేది స్టార్ట్ అవుతుంది. సోషల్ మీడియాలో జరిగే ఓటింగ్ వల్లే ఎవరు టాప్ లో ఉన్నారు అనేది తెలుస్తుంది. అన్ అఫీషియల్ పోలింగ్ సైట్స్ లో కూడా బిగ్ బాస్ లవర్స్ ఓట్లు వేస్తుంటారు. దీన్ని బట్టీ ఎవరు టాప్ లో ఉన్నారు. ఎవరు డేంజర్ జోన్ లో ఉన్నారు అనేది తెలిసిపోతుంది. ముందుగానే ఎలిమినేషన్ ని అంచనా వేస్తారు బిగ్ బాస్ ఫ్యాన్స్.
ఇందులో భాగంగా ఈవారం ఓటింగ్ అనేది చాలా ఆసక్తికరంగా జరిగింది. కెప్టెన్ అయిన కారణంగా అఖిల్ నామినేషన్స్ లో లేడు. ఈవారం నామినేషన్స్ లో చూసినట్లయితే, మిత్రాశర్మా, బిందుమాధవి, యాంకర్ శివ, మహేష్ విట్టా, హమీదా, ముమైత్ ఖాన్, నటరాజ్ మాస్టర్, అజయ్, అషూరెడ్డి, స్రవంతిలు ఉన్నారు. వీళ్లలో ఓటింగ్ అనేది రసవత్తరంగా జరిగింది. ప్రతి వారం లాగానే బిందు మాధవి టాప్ పొజీషన్ లో ఉంది. ఓటింగ్ లో దుమ్మురేపుతోంది.
అందరికంటే ఎక్కువగా దాదాపు 40 శాతం వరకూ ఓటింగ్ ని సంపాదించుకుంది. అలాగే, తర్వాత ప్లేస్ లో యాంకర్ శివ ఉన్నాడు. యాంకర్ శివ తర్వాత హమీదా, ఇంకా మహేష్ విట్టాలు కూడా సేఫ్ జోన్ లో ఉన్నారు. మిత్రాశర్మా అజయ్ ఇద్దరూ కూడా తమ ఓటింగ్ ని మెల్లగా పెంచుకుంటున్నారు. ఈసారి డేంజర్ జోన్ లో చూసినట్లయితే ముమైత్ ఖాన్, అషూరెడ్డి, స్రవంతి, నటరాజ్ మాస్టర్ లు ఉన్నారు.
ముమైత్ ఖాన్ మొదటివారమే ఎలిమినేట్ అయి వైల్డ్ కార్డ్ ద్వారా మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది. అంతేకాదు, ఈవారమే నామినేషన్స్ లోకి వచ్చింది. కానీ, ఇప్పుడు డేంజర్ జోన్ లో ఉంది. అలాగే, స్రవంతి కూడా డేంజర్ జోన్ లోే ఉంది. వీళ్లిద్దరిలోనే ఈసారి ఎలిమినేషన్ జరగబోతుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఇద్దరి మద్యలో గట్టి పోటీనే ఉంది. మరోవైపు నటరాజ్ మాస్టర్, అషూరెడ్డి ఇద్దరూ కూడా డేంజర్ జోన్ లోనే ఉన్నారు.
కాకపోతే ముమైత్ కన్నా, స్రవంతి కన్నా కొద్దిగా బెటర్ పొజీషన్ లో ఉన్నారు కాబట్టి సేఫ్ అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈవారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది చాలా ఇంట్రస్టింగ్. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ ఉంటే మాత్రం బిగ్ బాస్ మంచి ట్విస్ట్ ఇస్తాడు.