Bigg Boss: దీప్తి సునయన టు ప్రియాంక జైన్ … బిగ్ బాస్ లో హెయిర్ కట్ చేయించుకున్న భామలు!

హిందీలో సక్సెస్ అయిన ‘బిగ్‌బాస్‌’ రియాలిటీ షో తెలుగులో కూడా సక్సెస్ అయ్యింది. కానీ 5 సీజన్ల వరకు మాత్రమే సక్సెస్ ఫుల్ గా సాగింది అని చెప్పాలి. కానీ ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ అంటూ ఓటీటీ సీజన్ మొదలయ్యాక దాని హవా తగ్గింది. సీజన్ 6 అయితే రేటింగ్ చాలా తక్కువగా వచ్చింది. దీంతో బిగ్ బాస్ పని అయిపోయింది అని అంతా అనుకున్నారు. సీజన్ 7 ఈ మధ్యే ప్రారంభం అయ్యింది.

ఈ సీజన్ లో కంటెస్టెంట్స్ ను చూస్తే… సీజన్ 6 కి మించి డిజాస్టర్ అవుతుంది అని అంతా అనుకున్నారు. కానీ ఈ సీజన్ కి ఆదరణ బాగానే ఉంది. ప్రీమియర్ కి మంచి రేటింగ్ నమోదైంది. వీక్ డేస్ లో కూడా రేటింగ్ బాగానే వస్తుంది. ఇక ఈ సీజన్ లో టాస్క్ లు కూడా బాగానే డిజైన్ చేసారు. కుస్తీ పోటీలు వంటివి కూడా పెట్టారు. అయితే ప్రతి సీజన్లో ఎవరోఒకరు హెయిర్ కట్ చేయించుకోవడం ఆనవాయితీగా వస్తుంది.

సీజన్ 2 లో దీప్తి, సీజన్ 3 లో శివ పార్వతి, సీజన్ 4 లో హారిక, సీజన్ 6 లో వాసంతి హెయిర్ కట్ చేయించుకున్నారు. తమ తోటి కంటెస్టెంట్ ను సేఫ్ చేయడం కోసం వారు ఈ త్యాగాలు చేశారు. లేటెస్ట్ సీజన్ అంటే (Bigg Boss) సీజన్ 7 లో ప్రియాంక జైన్ కూడా హెయిర్ కట్ చేయించుకోవడం జరిగింది.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus