Balakrishna: బాలయ్య కోసం ఇంతమంది దర్శకులు ఎదురుచూస్తున్నారా.. ఏమైందంటే?

స్టార్ హీరో బాలకృష్ణకు (Balakrishna)  ఏ రేంజ్ లో ఫ్యాన్ బేస్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలయ్య బాబీ (Bobby) కాంబో మూవీ షూట్ శరవేగంగా జరుగుతుండగా ఈ ఏడాదే ఈ సినిమా విడుదల కానుందని సమాచారం అందుతోంది. ఈ సినిమా తర్వాత బాలయ్య బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబోలో ఒక సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. అయితే వరుస ప్రాజెక్ట్ లతో బాలయ్య బిజీగా ఉండగా బాలయ్య ఖాతాలో మరికొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయని సమాచారం.

హరీష్ శంకర్ (Harish Shankar)  , ప్రశాంత్ వర్మ (Prasanth Varma) , త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram) , అనిల్ రావిపూడి (Anil Ravipudi) , మరికొందరు దర్శకులు బాలయ్యతో సినిమా తీయడానికి సిద్ధంగా ఉన్నారు. బోయపాటి శ్రీను ప్రాజెక్ట్ పూర్తైన వెంటనే బాలయ్య ఈ ప్రాజెక్ట్ లతో బిజీ కానున్నారని సమాచారం అందుతోంది. ఈ విషయాలు తెలిసి బాలయ్య కోసం ఇంతమంది దర్శకులు ఎదురుచూస్తున్నారా అంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.

బాలయ్య ఎన్నికలు పూర్తైన తర్వాత వరుస సినిమాలలో నటించే ఛాన్స్ ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఒకే సమయంలో రెండు సినిమాలలో నటించేలా బాలయ్య ప్లాన్ చేసుకుంటే మాత్రం తిరుగుండదని ఫ్యాన్స్ చెబుతున్నారు. బాలయ్య 62 సంవత్సరాల వయస్సులో సైతం వరుస సినిమాలలో నటించే ప్రయత్నం అయితే చేస్తుండటం గమనార్హం. హిందూపురంలో బాలయ్య హ్యాట్రిక్ సాధిస్తానని నమ్ముతున్నారు. బాలయ్య బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ ను ఎంచుకుంటూ అదే సమయంలో ప్రముఖ బ్యానర్లలో నటిస్తున్నారు.

బాలయ్య క్రేజ్, రేంజ్, పాపులారిటీ వేరే లెవెల్ కాగా అద్భుతమైన కథాంశాలు ఎంచుకుంటే మాత్రమే బాలయ్య రేంజ్ మరింత పెరుగుతుంది. బాలయ్య ప్రశాంత్ వర్మ కాంబినేషన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని ఫ్యాన్స్ చెబుతుండటం గమనార్హం. బాలయ్య సినిమాలు 200 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధిస్తే చూడాలని ఉందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. బాలయ్య రాబోయే రోజుల్లో మరిన్ని ప్రాజెక్ట్ లను ప్రకటిస్తారేమో చూడాల్సి ఉంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus