Jr NTR: తారక్ డేట్స్ కోసం ఎదురుచూస్తున్న స్టార్ డైరెక్టర్లు వీళ్లే!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు. ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ కొరటాల శివ డైరెక్షన్ లో నటించాల్సిన సినిమా అంతకంతకూ ఆలస్యమవుతుండగా కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ ను సాధించాలనే ఆలోచనతో తారక్ స్క్రిప్ట్ పూర్తిస్థాయిలో నచ్చిన తర్వాతే ఈ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. తారక్ తో సినిమాను తెరకెక్కించే దర్శకుల జాబితాలో కొరటాల శివ, ప్రశాంత్ నీల్, బుచ్చిబాబు ఉన్నారనే సంగతి తెలిసిందే.

అయితే ఈ డైరెక్టర్లు మాత్రమే కాకుండా తారక్ తో సినిమా తెరకెక్కించాలని చాలామంది డైరెక్టర్లు భావిస్తున్నారు. సంజయ్ లీలా భన్సాలీ, వెట్రి మారన్, నాగ్ అశ్విన్, వక్కంతం వంశీ, అనిల్ రావిపూడి, శంకర్, లోకేశ్ కనగరాజ్, అట్లీ, త్రివిక్రమ్ తారక్ తో సినిమా తెరకెక్కించాలని భావిస్తున్నారు. తారక్ త్రివిక్రమ్ కాంబో మూవీ బడ్జెట్ కారణాల వల్ల వాయిదా పడగా ఈ సినిమా ఎప్పుడు తెరకెక్కుతుందో చూడాల్సి ఉంది. ఎన్టీఆర్ వేగంగా సినిమాలు చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

మరి కొందరు ఫ్యాన్స్ తారక్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి సీఎం కావాలని ఆశ పడుతున్నారు. రాజకీయాల విషయంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మనసులో ఏముందో తెలియాల్సి ఉంది. సినిమాసినిమాకు తారక్ కు క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది. తారక్ కెరీర్ విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. తనతో సినిమాలను నిర్మించిన నిర్మాతలకు సైతం నష్టాలు రాకుండా తారక్ జాగ్రత్త పడుతున్నారు.

తారక్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు 60 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం తీసుకుంటున్నారు. తారక్ తొలి రెమ్యునరేషన్ 4 లక్షల రూపాయలు కాగా కెరీర్ పరంగా అంతకంతకూ ఎదిగిన తారక్ ఊహించని స్థాయిలో పారితోషికాన్ని అందుకుంటున్నారు. వచ్చే ఏడాది తారక్ కొరటాల శివ కాంబో మూవీ థియేటర్లలో విడుదల కానుంది.

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus