Dasara Movies: ఈ ఏడాది దసరాకి విడుదల కానున్న సినిమాలు ఇవే..!

(Dasara Movies) ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో వరుస షూటింగులతో పండుగ వాతావరణం నెలకొంది.. సీనియర్, యంగ్ అండ్ మీడియం రేంజ్ హీరోలంతా వరుసగా సినిమాలతో సందడి చేస్తున్నారు.. చిరు, బాలయ్య, వెంకీ సెట్స్ మీద ఉండగా.. నాగ్ కొత్త సినిమాని పట్టాలెక్కించే పనుల్లో ఉన్నాడు.. ఇక తారక్, చరణ్, పవన్, మహేష్, బన్నీ, ప్రభాస్ కూడా ఫుల్ బిజీనే.. డై అండ్ నైట్ తేడా లేకుండా ఫుల్ ఎనర్జీతో పని చేస్తున్నారు..

పనిలో పనిగా సినిమాలు సెట్స్ మీద ఉండగానే రిలీజ్ డేట్స్ కోసం ఖర్చీఫ్స్ వేసేస్తున్నారు మేకర్స్.. ఇంకో హైలెట్ ఏంటంటే.. టైటిల్ కూడా ఫిక్స్ కాకుండానే డేట్స్ కన్ఫామ్ చేసేస్తున్నారు.. ఇటీవల పవన్ కళ్యాణ్ – సాయి ధరమ్ తేజ్ మూవీ, SSMB 28, రామ్ – బోయపాటి శ్రీనుల సినిమాలకు అలానే చేశారు.. సమ్మర్ విషయం పక్కన పెడితే దసరాకి రెడీ అవుతున్న మూవీస్ వివరాలు ఇలా ఉన్నాయి..

రామ్ – బోయపాటి..

ఉస్తాద్ రామ్ పోతినేని, ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుల కలయికలో వస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ఫిలింకి పేరు పెట్టలేదు కానీ ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు రిలీజ్ డేట్ ఇచ్చేశారు.. దసరా కానుకగా అక్టోబర్ 20 శుక్రవారం పాన్ ఇండియా స్థాయిలో వదలబోతున్నారు.. పోస్టర్ చూస్తుంటే హైదరాబాద్ సదర్ పండగ ఈ సారి నవరాత్రులలో చాలా గ్రాండ్‌గా ఉంటదనిపిస్తోంది..

NBK 108..

బాలయ్య, అనిల్ రావిపూడిల క్రేజీ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం NBK 108 (వర్కింగ్ టైటిల్).. కాజల్ అగర్వాల్ కథానాయికగా, శ్రీలీల, బాలయ్య కూతురిగా నటిస్తోంది.. రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీని విజయ దశమి కానుకగా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు..

హరి హర వీరమల్లు..

పవన్ కళ్యాణ్, క్రిష్ కాంబోలో రూపొందుతున్న‘హరి హర వీరమల్లు’ కూడా పాన్ ఇండియా స్థాయిలో దసరా కానుకగా బాక్సాఫీస్ బరిలో దిగనుందని సమాచారం..

లియో..

‘ఖైదీ’ తో సినిమాటిక్ యూనివర్స్‌ని క్రియేట్ చేసి ‘విక్రమ్’ తో ఆడియన్స్ మతి పోగొట్టిన టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్.. ‘మాస్టర్’ తర్వాత దళపతి విజయ్‌తో చేస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిలిం ‘లియో’.. దసరా స్పెషల్‌‌గా అక్టోబర్ 19 గురువారం నాడు వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు..

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus