Chiranjeevi: బాలయ్య 2.. చిరంజీవి 1… శాటిలైట్ రైట్స్ ఇంకా అమ్ముడుపోలేదట..!

ఒకప్పటి రోజుల్లో సినిమా విడుదలయ్యి 2 ఏళ్ళు గడిస్తేనే కానీ.. టీవీల్లో టెలికాస్ట్ అయ్యేవి కాదు. అది హిట్టు సినిమా అయినా.. ప్లాప్ సినిమా అయినా.. రెండేళ్ల వరకూ టీవీల్లో బొమ్మ పాడేది కాదు. కానీ అటు తరువాత ఏడాదికి లేదా 6 నెలలకు టీవీల్లో టెలికాస్ట్ అయ్యేవి కొన్ని సినిమాలు. ఇప్పటిరోజుల్లో అయితే సినిమా విడుదలైన 100 రోజుల్లోపే టీవీల్లో టెలికాస్ట్ అవుతున్నాయి. చాలా ఏళ్ళ నుండీ పెండింగ్ లో ఉన్న ‘జెండా పై కపిరాజు’, ‘ఏటో వెళ్ళిపోయింది’ మనసు వంటి చిత్రాలు కూడా ఈ మధ్యనే టీవీల్లో టెలికాస్ట్ అయ్యాయి.

శాటిలైట్ హక్కులకు ఆ రేంజ్లో డిమాండ్ కూడా పెరిగింది. కానీ ఇద్దరి స్టార్ హీరోల సినిమాలు మాత్రం ఇప్పటికీ టీవీల్లో టెలికాస్ట్ కాలేదు. వాళ్ళ సినిమాలకు ఇంకా శాటిలైట్ రైట్స్ బిజినెస్ కూడా జరగకపోవడం షాకిచ్చే అంశం. ఆ స్టార్ హీరోలు మరెవరో కాదు చిరంజీవి, బాలకృష్ణలే..! బాలకృష్ణ హీరోగా ‘పరమ వీర చక్ర’ మరియు ‘అధినాయకుడు’ సినిమాలు వచ్చాయి. వీటిలో ‘పరమ వీర చక్ర’ సినిమా దాసరి నారాయణ రావు గారి డైరెక్షన్లో రూపొందింది. ఇది ఆయనకి 150వ చిత్రం కావడం విశేషం.

2011లో విడుదలైన ఈ చిత్రం ఘోర పరాజయం పాలయ్యింది. దాంతో ఈ చిత్రం శాటిలైట్ హక్కులు ఇంకా అమ్ముడు పోలేదు. ‘అధినాయకుడు’ సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది. ఇక చిరంజీవి గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చిన కన్నడ చిత్రం ‘సిపాయి’ ని కూడా తెలుగులో ‘మేజర్’ పేరుతో డబ్ చేశారు. ఈ చిత్రం ప్లాప్ అవ్వడంతో శాటిలైట్ హక్కులు ఇప్పటికీ అమ్ముడు పోలేదు.

1

2

3

Most Recommended Video

వైల్డ్ డాగ్ సినిమా రివ్యూ & రేటింగ్!
సుల్తాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus