ఇప్పుడు డైరెక్టర్లకి ఛాన్స్ లు రావడమే కష్టంగా మారింది. వాళ్ళు కనుక ఓ ప్లాప్ ఇస్తే.. అది 5 ప్లాపులతో సమానం అన్నట్టు తయారయ్యింది పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఏళ్ళ తర్వాత అవకాశాలు వస్తే.. ఆ డైరెక్టర్లు ఎంత జాగ్రత్తగా సినిమాలు చేయాలి చెప్పండి. కానీ కొంతమంది డైరెక్టర్లు మాత్రం తమ పద్ధతి ఏమాత్రం మార్చుకోలేదు. సెప్టెంబర్ నెలలో చూసుకుంటే 4 మంది దర్శకులు ఏళ్ళ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చినట్టు అయ్యింది.
వాళ్లలో ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ దర్శకుడు మహేష్ బాబు ఒకడు. అతను ఏళ్ల తర్వాత వచ్చిన మంచి సక్సెస్ అందుకున్నాడు. ఓ చిన్న పాయింట్ ను ఇప్పటి యూత్ కి కనెక్ట్ అయ్యేలా తీసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. అతను సేఫ్.. హ్యాపీగా నెక్స్ట్ ప్రాజెక్టుల కోసం రెడీ అవుతున్నాడు. కానీ ఇదే నెలలో ‘చంద్రముఖి 2 ‘ తో పి.వాసు, ‘పెదకాపు 1 ‘ తో శ్రీకాంత్ అడ్డాల, ‘రూల్స్ రంజన్’ తో రత్నం కృష్ణ ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ముందుగా పి.వాసు సంగతికి వస్తే ‘చంద్రముఖి’ అనే సూపర్ హిట్ మూవీకి సీక్వెల్స్ ఎందుకు తీస్తున్నాడో అర్థం కాదు. ‘నాగవల్లి’ తోనే అతనికి క్లారిటీ వచ్చి ఉండాలి. కానీ ‘చంద్రముఖి 2 ‘ అంటూ మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇది కొత్తగా ఏమీ అనిపించదు. పోనీ కొత్త రైటర్స్ ను పెట్టుకుని ఏమైనా అద్భుతాలు చేసే ప్రయత్నం పి.వాసు చేశాడా అంటే.. అది కూడా లేదు. ఇక శ్రీకాంత్ అడ్డాల విషయానికి వద్దాం..! రీసెంట్ గా ‘పెదకాపు 1 ‘ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
‘బ్రహ్మోత్సవం’ తర్వాత ఇతని (Directors) డైరెక్షన్లో రూపొంది.. థియేటర్లలో రిలీజ్ అయిన సినిమా ఇదే. కానీ ఇది ‘బ్రహ్మోత్సవం’ ని మించి డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమా చూస్తుంటే తన పద్ధతి ఏమాత్రం మార్చుకోలేదు అని స్పష్టమవుతుంది. అర్థం పద్దం లేని డైలాగులు, లాజిక్ లేని సన్నివేశాలు.. ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టాయి. ఇక రత్నం కృష్ణ సంగతికి వచ్చేద్దాం. నిన్ననే ‘రూల్స్ రంజన్’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా చూస్తున్నంత సేపు అతను ఇంప్రూవ్ అయ్యింది ఏమీ లేదు అనే ఫీలింగ్ అందరికీ కలిగింది.
మ్యాడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
మామా మశ్చీంద్ర సినిమా రివ్యూ & రేటింగ్!