Sukumar: సుకుమార్ శిష్యుల్లో ఈ ముగ్గురూ సక్సెస్ కాలేదట..!

ఈ మధ్యనే ‘దసరా’ ‘విరూపాక్ష’ సినిమాలు రిలీజ్ అయ్యాయి. నాని హీరోగా నటించిన దసరా మూవీకి శ్రీకాంత్ ఓదెల దర్శకుడు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి కూడా నటించాడు. తెలంగాణ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ‘రంగస్థలం’ ‘ఆర్య 2 ‘ సినిమాల పోలికలు ఉంటాయి. ఎందుకంటే శ్రీకాంత్ ఓదెల సుకుమార్ వద్ద శిష్యరికం చేశాడు కాబట్టి.సుకుమార్ తెరకెక్కించిన ‘నాన్నకు ప్రేమతో’ ‘రంగస్థలం’ చిత్రాలకు సుకుమార్ వద్ద పనిచేసాడు.

అలాగే విరూపాక్ష దర్శకుడు కార్తీక్ దండు కూడా సుకుమార్ శిష్యుడే. వీళ్ళు మాత్రమే కాదు ఉప్పెన తో బ్లాక్ బస్టర్ అందుకున్న బుచ్చిబాబు సానా, కుమారి 21ఎఫ్, 18 పేజెస్ చిత్రాల దర్శకుడు పలనాటి సూర్య ప్రతాప్ కూడా సుకుమార్ శిష్యుడే. వీళ్లంతా సక్సెస్ అయితే సుకుమార్ కు ఇంకా మంచి పేరు వచ్చింది. భవిష్యత్తులో సుకుమార్ శిష్యులు డైరెక్టర్లుగా మారి సినిమాలు చేయాలి అనుకుంటున్నారు అంటే .. వాళ్ళకు మంచి నిర్మాతలు దొరికే అవకాశం కూడా ఉంది.

అయితే సక్సెస్ అయిన వాళ్ళనే ప్రపంచం గుర్తుపెట్టుకుంటుంది. సుకుమార్ శిష్యుల్లో ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరు అంటే..! 2012 లో రానా తో నా ఇష్టం.. అనే చిత్రాన్ని తీశాడు దర్శకుడు ప్రకాష్ తోలేటి. ఇతను సుకుమార్ శిష్యుడే. కానీ సక్సెస్ కాలేకపోయాడు. అలాగే దర్శకుడు, ప్లే బ్యాక్ అనే చిత్రాలు తీసిన జక్కా హరి ప్రసాద్ కూడా సుకుమార్ శిష్యుడే. ఇతను కూడా ఇంకా సక్సెస్ కాలేదు.

అంతేకాదు 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే చిత్రాన్ని తీసిన దర్శకుడు మున్నా అలియాస్ ఫణి ప్రదీప్ కూడా .. సుకుమార్ శిష్యుడే. ఈ సినిమా కమర్షియల్ హిట్ అయ్యింది కానీ .. కంటెంట్ వీక్ గా ఉండడంతో మున్నా ఇంకా ఫేమ్ లోకి రాలేకపోయాడు. ఇలా సుకుమార్ శిష్యుల్లో సక్సెస్ కాని వాళ్ళు కూడా ఉన్నారు.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus