Mahesh Babu: మహేష్ ని కృష్ణుడిగా చూపించడానికి వాళ్ళు అడ్డుపడ్డారా?..మంచి ఛాన్స్ మిస్ అయ్యిందిగా..!

రాజమౌళి (S. S. Rajamouli) ఇప్పటివరకు తన వల్ల స్టార్స్ అయిన హీరోలతో సినిమాలు చేశారు. ఎన్టీఆర్ (Jr NTR) స్టార్ అయ్యింది ‘సింహాద్రి’ (Simhadri) తో, రాంచరణ్ (Ram Charan)  స్టార్ అయ్యింది ‘మగధీర’ (Magadheera) తో, ప్రభాస్ (Prabhas) స్టార్ అయ్యింది ‘ఛత్రపతి’ (Chatrapathi) తో..! వీళ్ళతోనే రిపీటెడ్ గా సినిమాలు చేస్తూ వచ్చారు రాజమౌళి. కానీ ఫర్ ది ఫస్ట్ టైం.. రాజమౌళి నేరుగా ఓ పెద్ద స్టార్ తో పనిచేస్తున్నారు. అతనే మహేష్ బాబు (Mahesh Babu). రాజమౌళితో సినిమా చేయకపోయినా అతను సూపర్ స్టారే. కానీ అతనికి పాన్ ఇండియా ఇమేజ్ ఇంకా రాలేదు.

Mahesh Babu

మరోపక్క రాజమౌళి పాన్ వరల్డ్ స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు. సో ఇప్పుడు మహేష్ (Mahesh Babu) కంటే రాజమౌళిదే అప్పర్ హ్యాండ్. అందుకే వీళ్ళ కాంబోలో రూపొందే సినిమా విషయంలో ఎక్కువగా రాజమౌళిదే పైచేయి అవుతుంది. ఒకప్పటిలా మహేష్ టీం కూడా ఈ ప్రాజెక్టు గురించి అప్డేట్స్ ఇవ్వడానికి లేదు. మహేష్ టీం అంతా రాజమౌళి కంట్రోల్లో ఉండాల్సిందే. రాజమౌళి ఏ హీరోతో పనిచేసినా.. అతని సినిమా కంప్లీట్ అయ్యే వరకు ఆ హీరో ఇంకో ప్రాజెక్టు చేయడానికి ఒప్పుకోడు.

ఇది చాలా మందికి తెలిసిన విషయమే. అయితే మహేష్ బాబు మేనల్లుడు గల్లా జయదేవ్ హీరోగా (Ashok Galla) తెరకెక్కిన ‘దేవకీ నందన వాసుదేవ’ (Devaki Nandana Vasudeva) చిత్రం క్లైమాక్స్ లో మహేష్ బాబుని కృష్ణుడిగా ప్రజెంట్ చేయడానికి దర్శకులు ప్రశాంత్ వర్మ (Prasanth Varma)  , అర్జున్ జంధ్యాల (Arun Jandyala)  రెడీ అయ్యారు. అది కూడా సీజీలో మహేష్ ను కృష్ణుడిగా చూపించాలని లెండి. ఈ విషయం టీం బయటకు రివీల్ చేసింది. ఇది అటు తిరిగి.. ఇటు తిరిగి రాజమౌళి చెవిన పడింది. దీంతో జక్కన్నకి కోపం వచ్చింది.

వెంటనే ఆయన నమ్రతకి (Namrata Shirodkar) ఫోన్ చేసి దీనిపై ఆరా తీయడం, అగ్రిమెంట్ గురించి గుర్తు చేయడం జరిగిందట. ఈ క్రమంలో ఆమె తన టీంపై మండిపడినట్టు తెలుస్తుంది. వెంటనే ‘దేవకీ నందన వాసుదేవ’ టీంకి కూడా ఫోన్ చేసి.. ‘ఆ ప్రయత్నాలు ఆపుకుని.. అది అబద్ధం అన్నట్టు ఓ ప్రెస్ నోట్ విడుదల చేయమని’ కోరిందట. వెంటనే టీం ప్రెస్ నోట్ రిలీజ్ చేసి.. ఆ ప్రచారం అబద్దమని సర్ది చెప్పింది ‘దేవకీ నందన వాసుదేవ’ టీం.

నాగ్ అశ్విన్.. కల్కి తరువాత ఆమెతోనా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus