సూపర్ స్టార్ కృష్ణ గారు మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్లో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణ వార్త రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రేక్షకులను విషాదంలోకి నెట్టేసింది. ఆయన్ని చివరి చూపు చూసుకునేందుకు సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు సామాన్య జనాలు కూడా పెద్ద ఎత్తున ఆయన నివాసానికి తరలివచ్చారు. దీంతో కృష్ణ ఇంటి వద్ద విపరీతమైన రద్దీ ఏర్పడింది. పెద్ద పెద్ద సెలబ్రిటీలు రావడం వల్ల వారి బందోబస్త్ తో సామాన్య జనాలకు ఇబ్బందులు ఎదురయ్యాయి.
వాళ్ళు వస్తున్నప్పుడు సెక్యూరిటీ వారు సామాన్యులను తోసెయ్యడం వంటివి చేసి వారిని ఇబ్బంది పెట్టారు. మరోపక్క తమ అభిమాన హీరో చనిపోయారు అనే బాధ వారికి ఎక్కువగా ఉండటంతో వాళ్లకు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఈ టైంలో జేబు దొంగలు తమ టాలెంట్ ను చూపెట్టారు. కృష్ణ గారి మరణవార్తతో అభిమానులు.. దుఃఖంలో, అయోమయంలో ఉన్న తరుణంలో జేబు దొంగలు.. వారి దగ్గర్నుండి మొబైల్ ఫోన్ లు, పర్స్ లు వంటివి చోరీ చేశారు.
తర్వాత అభిమానులు తేరుకుని తమ వస్తువులను చెక్ చేసుకుంటే.. అవి మాయమయ్యాయి. దీంతో వారు పక్కనున్న వారిని నిందించి, నిలదీయడం.. ఇరువురి మధ్య వాగ్వివాదాలు చోటు చేసుకోవడంతో.. ఇదే మంచి సమయం అని దొంగలు కూడా జారుకున్నారు. ఇక జనాల మధ్య మాటలు యుద్ధం చోటు చేసుకున్న టైంలో ట్రాఫిక్ జామ్ అవ్వడం, ఎక్కువ హార్న్ లు కొట్టినా జనాలు పట్టించుకోకుండా గొడవపడటం జరిగింది.
కాసేపటి తర్వాత పోలీసులు వచ్చి నచ్చజెప్పడంతో పరిస్థితి సర్దుకుంది. అలాగే ఎవరైతే వస్తువులు పోగొట్టుకున్నారు వాళ్ళను సీసీటీవీ ఫుటేజ్ ఉన్న రూమ్ కు తీసుకెళ్లి.. నిందితులను గుర్తించిన తర్వాత పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వమని సూచించారట.
యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?
‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!