‘మెంటల్ మదిలో’ ‘నీది నాదీ ఒకే కథ’ ‘బ్రోచేవారెవరురా’ వంటి విభిన్న చిత్రాలతో మంచి టేస్ట్ ఉన్న హీరోగా పేరు సంపాదించుకున్నాడు హీరో శ్రీవిష్ణు. ఈ కుర్ర హీరో సినిమా అంటే కచ్చితంగా బాగుంటుంది అనే నమ్మకం ప్రేక్షకుల్లో ఏర్పడింది. అయితే ఇటీవల వచ్చిన ‘తిప్పరామీసం’ సినిమా ఆ నమ్మకాన్ని మొత్తం చంపేసిందనే చెప్పాలి. ‘రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్’ బ్యానేర్ పై రూపొందిన ఈ చిత్రాన్ని ‘అసుర’ ఫేమ్ కృష్ణ విజయ్ డైరెక్ట్ చేసాడు. నవంబర్ 8న విడుదలైన ఈ చిత్రం మొదటి షో తోనే డిజాస్టర్ టాక్ ను మూటకట్టుకోవడంతో ప్రేక్షకులు ఈ చిత్రాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారని చెప్పొచ్చు.
నైజాం
0.23 cr
సీడెడ్
0.08 cr
ఉత్తరాంధ్ర
0.11 cr
ఈస్ట్
0.06 cr
వెస్ట్
0.04 cr
కృష్ణా
0.06 cr
గుంటూరు
0.05 cr
నెల్లూరు
0.03 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్
0.02 cr
వరల్డ్ వైడ్ టోటల్
0.73 cr(షేర్)
‘అర్జున్ రెడ్డి’ సినిమానే కాస్త అటూ.. ఇటూ చేసి ‘తిప్పరామీసం’ తీసారనే కామెంట్స్ బలంగా వినిపించాయి. ఇక రివ్యూలు, రేటింగ్ లు కూడా చాలా బ్యాడ్ గా ఉండడంతో ఈ చిత్రం కనీసం ఓపెనింగ్స్ కూడా రాబట్టలేకపోయింది. ఇక ఈ చిత్రానికి 2.5 కోట్ల కు అమ్మగా కేవలం 0.73 లక్షల షేర్ ను మాత్రమే రాబట్టి ట్రేడ్ ను సైతం షాక్ కు గురిచేసింది. ‘తిప్పరామీసం’ చిత్రం శ్రీవిష్ణు కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ అని చెప్పుకోవచ్చు. సరైన విధంగా ఈ చిత్రాన్ని ప్రమోషన్ చేయకపోవడం వల్లే.. ఇంత పెద్ద డిజాస్టర్ అయినట్టు తెలుస్తుంది.