బిగ్ బాస్ హౌస్ లో 2వ వారం ఓటింగ్ అనేది చాలా రసవత్తరంగా జరిగింది. అయితే, ఇప్పుడు ఈవారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే, 4వారాల ఇమ్యూనిటీ టాస్క్ లో గెలిచింది ఎవరో తెలిస్తేనే దాన్ని బట్టీ ఎలిమినేషన్ ఉండబోతోంది. ఈవారం చూస్తే మొత్తం తొమ్మిది మంది నామినేషన్స్ లో ఉన్నారు. వాళ్లలో ఎవరికి ఎంత పర్సెంట్ ఓటింగ్ వచ్చిందనేది ఒక్కసారి చూసినట్లయితే., అసలు పల్లవి ప్రశాంత్ కి ఓటింగ్ అనేది జరుగుతోందా..
వెబ్ సైట్స్ లో కావాలని ఫేక్ ఓటింగ్ చేస్తున్నారా అనేది పెద్ద ప్రశ్నగా మారింది. ఈవారం గేమ్ లో పెద్దగా పార్టిసిపేట్ చేసింది లేదు. మలుపులో గెలుపు అనేది ఒక్క గేమ్ గెలిచాడు. సైలెంట్ గా ఉన్నాడు. కేవలం నామినేషన్స్ లో మాత్రమే విశ్వరూపం చూపించాడు. కొద్దిగా అతి చేశాడు. అయినా కూడా మనోడికి ఓటింగ్ అనేది అన్ అఫీషియల్ సైట్స్ లో బాగా జరుగుతోంది. 28 పర్సెంట్ నుంచీ 30 పర్సెట్ వరకూ ఓటింగ్ అంటే మాములు విషయం కాదు.
సెకండ్ పొజీషన్ లో అమర్ – శివాజీ నువ్వా నేనా అని పోటీ పట్టారు. పైనల్ గా అమర్ 18 నుంచీ 20 శాతం వరకూ ఓటింగ్ ని తెచ్చుకున్నాడు. అలాగే, శివాజీ కూడా 18 శాతం వరకూ ఓటింగ్ ని ప్రబావితం చేశాడు. మూడో ప్లేస్ లో సెటిల్ అయ్యాడు. సో ఈ ముగ్గురూ సేఫ్ గానే ఉన్నారు. ఇక మిగిలిన ఆరుగురు ఓటింగ్ అనేది రోజు రోజుకీ మారిపోతునే ఉంది.
దాదాపుగా 8శాతం ఓటింగ్ ని రతిక కైవసం చేస్కుంది. తను కూడా (Bigg Boss 7 Telugu) ఈవారం సేఫ్ జోన్ లోనే ఉంటుంది. నెక్ట్స్ ఐదో ప్లేస్ లో గౌతమ్ ఉన్నాడు. గౌతమ్ కూడా సేఫ్ అయిపోతాడు. తనకి కూడా ఆల్ మోస్ట్ 7శాతం ఓటింగ్ అయితే జరిగింది. ఇక్కడ రతిక గౌతమ్ ఇద్దరూ కూడా మంచి టఫ్ పైట్ ఇచ్చారు. నెక్ట్స్ ఉన్నది అందరూ డేంజర్ జోనే.. ఎందుకంటే., అందరికీ 4 పర్సెంట్ 3 పర్సెంట్, 2 పర్సెంట్ మాత్రమే ఓటింగ్ అనేది జరిగింది.
అయితే, ఇందులో ఆర్డర్ చూస్తే టేస్టీ తేజ, శోభాశెట్టి, ప్రిన్స్ యావార్ ఇంకా షకీల ఇలా ఉన్నారు. వీళ్లలో ఎవరైనా వెళ్లిపోవచ్చు. వీళ్లందరూ డేంజర్ జోన్ లోనే ఉన్నారు. షకీల బోటమ్ లో లాస్ట్ లో ఉంది కాబట్టి ఈవారం ఎవిక్షన్ ఫ్రీ కాకపోతే ఖచ్చితంగా ఇంటి నుంచీ అవుట్ అయిపోద్ది. లేదంటే శోభాశెట్టి, ప్రిన్స్ యవార్ లు మంచి కంటెంట్ ఇస్తున్నారు కాబట్టి బిగ్ బాస్ టీమ్ టేస్టీ తేజని కూడా పంపించేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.