Adipurush: ఆదిపురుష్ సినిమాకు ఆ డైలాగ్ హైలెట్ కానుందా?

2023 సంక్రాంతి పండుగ కానుకగా విడుదల కావాల్సిన ఆదిపురుష్ మూవీ ఈ ఏడాది జూన్ కు వాయిదా పడిందనే సంగతి తెలిసిందే. అయితే ఆ సమయానికి కూడా ఈ సినిమా విడుదలవుతుందో లేదో అనే కన్ఫ్యూజన్ ఉండటంతో ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. అయితే ఆదిపురుష్ మూవీలో ప్రభాస్ రెండు పేజీల డైలాగ్ చెప్పారని సినిమాకు ఈ డైలాగ్ హైలెట్ గా నిలిచే విధంగా ఉండనుందని సోషల్ మీడియాలో కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

అయితే ఆదిపురుష్ రిలీజ్ డేట్ గురించి మేకర్స్ పూర్తిస్థాయిలో స్పష్టత ఇస్తే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సలార్ మూవీతో ప్రభాస్ ఇమేజ్ డబుల్ అవుతుందని ఆదిపురుష్ కూడా సక్సెస్ సాధిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ చెబుతున్నారు. వేగంగా గ్రాఫిక్స్ లో మార్పులు చేసి ఈ సినిమాను విడుదల చేస్తే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆదిపురుష్ మేకర్స్ నిర్ణయం ఏంటో క్లారిటీ రావాల్సి ఉంది. ఆదిపురుష్ గ్రాఫిక్స్ లో కీలక మార్పులు చేస్తే మాత్రం ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచే అవకాశం అయితే ఉంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఆదిపురుష్ ప్రభాస్ సినీ కెరీర్ లో ఏ రేంజ్ హిట్ గా నిలుస్తుందనే ప్రశ్నకు జవాబు దొరకాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ప్రభాస్ సైతం కథల ఎంపికలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ప్రతి సినిమా సక్సెస్ సాధించాలని ప్రభాస్ కోరుకుంటున్నారు. ప్రభాస్ స్థాయి మరింత పెరగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. పాన్ వరల్డ్ హీరోగా సలార్ సినిమాతో ప్రభాస్ కు గుర్తింపు రానుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

సలార్ రెండు భాగాలుగా తెరకెక్కుతుండగా ఈ రెండు సినిమాలు చరిత్ర సృష్టించడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కే, స్పిరిట్ సినిమాలపై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus