Samantha: సమంతను డైరెక్ట్ చేయనున్న హీరో!

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా చెలామణి అవుతోంది సమంత. ఓ పక్క కమర్షియల్ సినిమాల్లో నటిస్తూనే మరోపక్క లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తోంది. రీసెంట్ గా ఈ బ్యూటీ నటించిన ‘యశోద’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి హిట్ టాక్ రావడంతో సమంత క్రేజ్ పెరిగింది. కలెక్షన్స్ కూడా బాగానే వస్తున్నాయి. డిజిటల్, శాటిలైట్ రైట్స్ వలన ‘యశోద’ సినిమా సేఫ్ ప్రాజెక్ట్ గా నిలిచింది.

త్వరలోనే ఆమె నటించిన మరో లేడీ ఓరియెంటెడ్ సినిమా ‘శాకుంతలం’ విడుదల కానుంది. గుణశేఖర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు సమంత కోసం మరో లేడీ ఓరియెంటెడ్ కథ రెడీ అయిందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ‘అందాల రాక్షసి’ సినిమాతో హీరోగా పరిచయమైన రాహుల్ రవీంద్రన్ ఇప్పుడు దర్శకుడిగా మారి సినిమాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఆయన డైరెక్ట్ చేసిన ‘చిలసౌ’ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.

ఆ తరువాత నాగార్జున హీరోగా ‘మన్మథుడు2’ సినిమాను డైరెక్ట్ చేశారు. ఆ సమయంలోనే ఓ లేడీ ఓరియెంటెడ్ కథను రెడీ చేసుకున్నారు. రష్మికను హీరోయిన్ గా అనుకున్నారు. ఆమెకి కథ కూడా వినిపించారు. ‘మన్మథుడు2’ సినిమా హిట్ అయి ఉంటే కచ్చితమా ఈ లేడీ ఓరియెంటెడ్ సినిమా సెట్స్ పైకి వెళ్లేది. కానీ సినిమా ప్లాప్ అవ్వడంతో రష్మిక ధైర్యం చేయలేకపోయింది.

ఇప్పుడు రాహుల్ మళ్లీ ఆ కథను తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టారట. అయితే ఈసారి సమంతకు ఈ కథ చెప్పి ఒప్పించాలనుకుంటున్నారు. సమంతకు రాహుల్ కి మధ్య మంచి స్నేహం ఉంది. రాహుల్ ఫ్యామిలీతో సమంత చాలా క్లోజ్ గా ఉంటుంది. కాబట్టి రాహుల్ కి సమంత ఓ ఛాన్స్ ఇచ్చేలా ఉంది. అన్నీ కుదిరితే గీతాఆర్ట్స్ సంస్థ ఈ సినిమాని నిర్మించే ఛాన్స్ ఉంది.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus