న్యూస్ రీడర్ గా కెరీర్ ను మొదలుపెట్టి నటుడిగా, రచయితగా, దర్శకుడిగా వక్కంతం వంశీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన అశోక్, ఊసరవెల్లి, టెంపర్ సినిమాలు వక్కంతం వంశీ కథలతోనే తెరకెక్కాయి. ఈ సినిమాలలో అశోక్, ఊసరవెల్లి సినిమాలు ఫ్లాప్ రిజల్ట్ ను అందుకుంటే టెంపర్ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. వాస్తవానికి టెంపర్ సినిమా కథతోనే దర్శకునిగా పరిచయం కావాలని వక్కంతం వంశీ భావించినా కొన్ని కారణాల వల్ల అది సాధ్యం కాలేదు.
ఆ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా వక్కంతం వంశీ డైరెక్షన్ లో కళ్యాణ్ రామ్ నిర్మాతగా ఒక ప్రాజెక్ట్ కు సంబంధించి ప్రచారం జరిగింది. అయితే వేర్వేరు కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాతో వక్కంతం వంశీ దర్శకునిగా కెరీర్ ను మొదలుపెట్టారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ రిజల్ట్ ను అందుకుంది.
ఈ సినిమా ఫలితం వల్ల వక్కంతం వంశీకి సినిమా ఆఫర్లు కూడా తగ్గాయి. నితిన్ వక్కంతం వంశీ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమాతో వక్కంతం వంశీ దర్శకునిగా కచ్చితంగా సక్సెస్ ను సొంతం చేసుకోవాల్సి ఉంది. ఈ సినిమా సక్సెస్ సాధిస్తే తారక్ వక్కంతం వంశీ కాంబోలో సినిమా తెరకెక్కే ఛాన్స్ అయితే ఉంది.
పాన్ ఇండియా హీరోగా గుర్తింపును సొంతం చేసుకున్న తారక్ టాలెంట్ ఉన్నవాళ్లను ప్రోత్సహించే విషయంలో ముందువరసలో ఉంటారనే సంగతి తెలిసిందే. తారక్ కు వక్కంతం వంశీపై మంచి అభిప్రాయమే ఉంది. వక్కంతం వంశీ సరైన కథతో తారక్ ను కలిస్తే మాత్రం ఈ కాంబినేషన్ లో సినిమా రావడానికి ఎంతో సమయం పట్టదని చెప్పవచ్చు.
Most Recommended Video
తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?