Mahesh Babu: ఆ నిబంధనల వల్ల సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఇబ్బందేనా?

  • May 31, 2023 / 09:15 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలలో మహేష్ బాబు ఒకరు కాగా గత కొన్నేళ్లుగా వరుస విజయాలను సొంతం చేసుకుంటున్న మహేష్ బాబు ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్న మహేష్ బాబు ఈ సినిమా తర్వాత రాజమౌళి డైరెక్షన్ లో ఒక సినిమాలో నటించనున్నారు. సాధారణంగా జక్కన్న తన డైరెక్షన్ లో నటిస్తున్న హీరో మరో సినిమాలో నటించడానికి ఇష్టపడరు.

తన సినిమాలో నటించే హీరో లుక్ లీక్ కావడం కూడా జక్కన్నకు అస్సలు ఇష్టం ఉండదనే సంగతి తెలిసిందే. మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుండగా ఈ సినిమా విడుదలైన వెంటనే మహేష్ జక్కన్న కాంబో మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే మహేష్ జక్కన్న కాంబో మూవీ రిలీజ్ అయ్యే వరకు మహేష్ నుంచి కొత్త సినిమాల ప్రకటన అయితే లేనట్టేనని కామెంట్లు వినిపిస్తున్నాయి.

త్రివిక్రమ్ సినిమాకు 70 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్న మహేష్ బాబు రాజమౌళి సినిమా కోసం 100 నుంచి 110 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమా కోసం తన లుక్ ను మార్చుకోవడంతో పాటు ఎంతగానో కష్టపడనున్నారని తెలుస్తోంది. మహేష్ జక్కన్న కాంబో మూవీపై అంచనాలు పెరుగుతున్నాయి.

మహేష్(Mahesh Babu) వేగంగా సినిమాలలో నటించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రెండేళ్లకు ఒక సినిమాలో నటించే విధంగా మహేష్ బాబు కెరీర్ ను నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేసుకుంటున్నారని తెలుస్తోంది. వరుస విజయాలు మహేష్ బాబు స్థాయిని పెంచడం గ్యారంటీ అని కొంతమంది చెబుతున్నారు. రాజమౌళి సినిమాతో పాన్ వరల్డ్ స్థాయిలో మహేష్ పేరు మారుమ్రోగుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus