ఇప్పట్లో సమంతకు మాత్రమే అలా జరుగుతుంది..!

వరుసగా కథా ప్రాధాన్యత ఉండే సినిమాలనే సెలెక్ట్ చేసుకుంటూ వరుస విజయాలు అందుకుంటుంది మన అక్కినేని వారి ఇంటి కోడలు సమంత. తెలుగుతో పాటు తమిళంలో కూడా ఆమె స్టార్ హీరోయిన్ అన్న సంగతి తెలిసిందే. మొన్నటి వరకూ ఈ రేస్ లో నయనతార, అనుష్క మాత్రమే కనిపించేవారు. కానీ ఇప్పుడు సమంత కూడా ఆ లిస్ట్ లో చేరింది. అంటే ఈమె కూడా లేడీ సూపర్ స్టార్ అయిపొయింది అనే చెప్పాలి. సాధారణంగా సినిమాల్లో హీరో ఇంట్రడక్షన్ కు మాత్రమే పేపర్లు వేయడం.. అరుపులు అరవడం వంటివి జరుగుతాయి. కానీ సమంత నటించే సినిమాల విషయంలో కూడా అలా జరుగుతుండడం విశేషం.

ఒకటి కాదు.. రెండు కాదు.. వరుసగా 3వ సారి కూడా ఇలా జరగడం విశేషం. ‘మజిలీ’ చిత్రంలో నాగ చైతన్య ఎంట్రీ కంటే.. ఇంటర్వెల్ దగ్గర సమంత ఎంట్రీకే ఎక్కువ సందడి చేశారు. ఆ సీన్ దగ్గర వచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. ఓ స్టార్ హీరో ఎంట్రీ రేంజ్లో ఇచ్చాడు తమన్. ఇక రెండోసారి ‘ఓ బేబీ’ సినిమాలో..! ఈ సినిమాలో కూడా సమంత ఎంట్రీ కాస్త లేట్ అవుతుంది. ఒక 30 నిమిషాల తర్వాతే ఆమె ఎంట్రీ ఉంటుంది. ఆ సినిమాలో కూడా సమంత ఎంట్రీకి థియేటర్లలో సందడి చేశారు. ఇక మూడో సారి నిన్న విడుదలైన ‘జాను’ సినిమాలో అని చెప్పాలి. ఇందులో కూడా సమంత ఎంట్రీ లేట్ గా ఉంటుంది. సమంత క్యాబ్ దిగి.. అలా నడిచివస్తున్న సీన్ కు ఈలలు, కేకలతో థియేటర్లు దద్దరిల్లయాయనే చెప్పాలి. ఇక సినిమాలో ఆమె నటనకి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ’96’ లో త్రిష కు ఏమాత్రం తీసిపోకుండా ‘జాను’ లో సమంత నటించిందనే చెప్పాలి. ఇంకా గట్టిగా చెప్పాలి అంటే.. సమంత తప్ప తెలుగులో ఈ పాత్రకు ఎవ్వరూ న్యాయం చెయ్యలేరు అని చెప్పడంలో కూడా అతిశయోక్తి లేదు.

Most Recommended Video

జాను సినిమా రివ్యూ & రేటింగ్!
సవారి సినిమా రివ్యూ & రేటింగ్!
అల్లు అర్జున్ ఆస్తుల వివరాలు
ఎన్టీఆర్ ఆస్తుల వివరాలు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus