Virata Parvam: రానా ‘విరాట పర్వం’ ఇంత లేట్ అయ్యింది అందుకేనట..!

దగ్గుబాటి రానా హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘విరాట పర్వం’. ‘శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్’ ‘సురేష్ ప్రొడక్షన్స్’ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి, డి.సురేష్ బాబు లు ఈ చిత్రాన్ని నిర్మించారు.ప్రియమణి, నివేదా పేతురాజ్ వంటి హీరోయిన్లు కూడా ఈ మూవీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈశ్వరి రావ్, నవీన్ చంద్ర,సాయి చంద్,నందితా దాస్… వంటి వారు కూడా ముఖ్య పాత్రలు పోషించారు.

నిజానికి ఈ చిత్రం షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ అయ్యింది. గతేడాది ‘అరణ్య’ సినిమా విడుదల టైంలోనే టీజర్ ను విడుదల చేశారు. ‘కోలు కోలోయమ్మ’ అనే పాట కూడా హిట్ అయ్యింది. సురేష్ బొబ్బిలి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అంతా బానే ఉంది కానీ ఈ మూవీ విడుదల ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. ‘భీమ్లా నాయక్’ కంటే ముందే ఈ చిత్రం విడుదల కావాల్సింది. ఓ సందర్భంలో ఈ మూవీ ఓటిటిలో విడుదలవుతుంది అని కూడా వార్తలు వచ్చాయి.

సురేష్ బాబు కూడా ఆ దిశగా ప్రయత్నాలు చేశారు. కానీ చివర్లో విరమించుకున్నారు. ఎట్టకేలకు ఈ చిత్రాన్ని జూలై 1న విడుదల చేస్తానని చిత్ర బృందం ప్రకటించింది. కానీ ఆ డేట్ కు కూడా ఈ మూవీ రిలీజ్ అవుతుందా అంటే అనుమానమే అంటున్నాయి ఫిలింనగర్ వర్గాలు. దీని వెనుక ఓ కారణం కూడా ఉంది. ‘విరాట పర్వం’ చిత్రం నక్సల్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన మూవీ. కాబట్టి ఈ మూవీకి ఆశించిన స్థాయిలో బిజినెస్ జరగడం లేదట.

ఓటిటి డీల్స్ కూడా అంతంత మాత్రంగానే వచ్చినట్టు వినికిడి. ఈ చిత్రం నిర్మాతల్లో ఒకరైన సుధాకర్ చెరుకూరికి ఒక్క హిట్టు కూడా లేదు. వీటి ఎఫెక్ట్ వల్లనే సినిమా డిలే అవుతుందని తెలుస్తుంది.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus