Samantha: స్టార్ హీరోయిన్ సమంతకు అదే మైనస్ అవుతోందా?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన సమంత శాకుంతలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడంలో ఫెయిల్ అవుతోంది. క్రిటిక్స్ నుంచి సైతం ఈ సినిమాకు నెగిటివ్ రివ్యూలు వచ్చాయి. ఈ సినిమా పుంజుకోవడం కష్టమేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాబోయే రోజుల్లో పౌరాణికాలను తెరకెక్కించాలనే దర్శకులు సైతం ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈతరం ప్రేక్షకులకు పౌరాణిక సినిమాలపై పెద్దగా ఆసక్తి లేకపోవడంతో పాటు సినిమా మరీ అద్భుతంగా ఉంటే మాత్రమే ప్రేక్షకులు థియేటర్లకు వచ్చే అవకాశం ఉండటంతో ఈ పరిస్థితి ఏర్పడింది.

అయితే అప్పుడు అనుష్క చేసిన తప్పే ఇప్పుడు (Samantha) సమంత కూడా చేస్తున్నారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. స్టార్ హీరోయిన్ అనుష్క పలు లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో విజయాలు అందుకున్నారు. అరుంధతి, భాగమతి మరికొన్ని సినిమాలు పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకోవడంతో పాటు కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టించాయి. ఈ సినిమాలు అనుష్కకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.

అయితే పంచాక్షరి, నిశ్శబ్దం, సైజ్ జీరో సినిమాలు అనుష్క ప్రధానంగా తెరకెక్కినా భారీ నష్టాలను మిగిల్చాయి. అనుష్కను నమ్మి భారీ బడ్జెట్ తో నిర్మించిన నిర్మాతలకు కొన్నిసార్లు భారీ షాకులు తగిలాయి. సమంత కూడా రిస్క్ తీసుకోకుండా ఈతరం ప్రేక్షకులకు నచ్చే కథలను ఎంచుకుంటే బాగుంటుందని చెప్పవచ్చు.

శృతి మించిన బడ్జెట్ తో సినిమాలు తెరకెక్కితే మాత్రం సమంత కెరీర్ కే నష్టమని చెప్పవచ్చు. సమంతకు కెరీర్ పరంగా ఇవే తరహా పొరపాట్లు రిపీట్ అయితే మాత్రం ఆమె కెరీర్ ఇబ్బందుల్లో పడే అవకాశాలు అయితే ఉంటాయి. భవిష్యత్తు ప్రాజెక్ట్ ల విషయంలో సమంత జాగ్రత్త వహించాల్సి ఉంది.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus