నేను అలా చేయకుండా ఉండాల్సింది : రకుల్ ప్రీత్

  • March 5, 2020 / 06:36 AM IST

‘అనుభవానికి మించిన గురువు లేదని’ చెబుతూ ఉంటారు మన పెద్దోళ్లు. కాలం అందరికీ గుణపాఠాలు నేర్పుతుంది అని కూడా చెబుతుంటారు. అది తొందరగా గ్రహిస్తే పర్వాలేదు. లేదంటే మన రకుల్ ప్రీత్ సింగ్ లా బాధపడాల్సి వస్తుంది. అదేంటి… రకుల్ కు ఏమైంది అనుకుంటున్నారా? వివరాల్లోకి వెళితే అతి తక్కువ సమయంలోనే అందరి స్టార్ హీరోలతోనూ నటించేసింది ఈ బ్యూటీ. పనిలో పనిగా కోలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చేసి అక్కడి స్టార్ హీరోలతో కూడా నటించేసింది. ఇందులో తప్పేముంది అనుకుంటున్నారా?

అక్కడికే వస్తున్నా… క్రేజ్ ను బట్టి పెద్ద సినిమాలు చేయడం ఏమాత్రం తప్పుకాదు. కాని పారితోషికాన్ని మాత్రమే దృష్టిలో పెట్టని .. కథని పట్టించుకోకుండా గ్లామర్ పాత్రలు చేయడమే తప్పు. ఆ విషయాన్ని ఎట్టకేలకు ఈ బ్యూటీ తెలుసుకుంది. ఇటీవల పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ… “నేను ఏ డైరెక్టర్ ను ఇబ్బంది పెట్టేదాన్ని కాదు. షూటింగ్ కు కూడా టైం కి వెళ్ళేదాన్ని. పారితోషికం విషయంలో చాలా తగ్గేదాన్ని… కాని ఇప్పుడు నాకు అవకాశాలు లేవు. దానికి కారణం నేను మొదటి నుండీ గ్లామర్ పాత్రలు మాత్రమే చేయడం వల్ల…! ఒకవేళ మొదటి నుండీ కదా ప్రాధాన్యత ఉన్న చిత్రాలని చేసి ఉంటే.. ఇప్పుడు చేతి నిండా సినిమాలతో బిజీగా ఉండేదాన్ని” అంటూ చెప్పుకొచ్చింది. ఇంత లేటుగా గ్రహించి ఉపయోగం ఏంటి.. అని కొందరు కామెంట్స్ చేస్తున్నప్పటికీ … ప్రస్తుతం ఈమె చేతిలో రెండు పెద్ద సినిమాలు ఉన్నాయి. ఒకటి ‘ఇండియన్ 2’ మరొకటి కోలీవుడ్ స్టార్ శివ కార్తి కేయన్ తో కూడా ఓ సినిమా చేస్తుంది. ఈ చిత్రాలు హిట్ అయితే మళ్ళీ ఈమె బిజీ అయ్యే అవకాశం పుష్కలంగా ఉంది.

Most Recommended Video

‘హిట్ ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘టాలీవుడ్ స్టార్ హీరోల రెమ్యూనరేషన్లు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus