Naga Chaitanya: ఆ ప్రశ్నల నుంచి తప్పించుకుంటున్న చైతూ.. కానీ?

టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన నాగచైతన్య గత కొన్నేళ్లుగా వరుస విజయాలను సొంతం చేసుకుంటుండగా థాంక్యూ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు. సాధారణంగా క్లాస్, ఎమోషనల్ సీన్స్ ఉండే సినిమాలు చైతన్యకు బాగా సూట్ అవుతాయని ఫ్యాన్స్ భావిస్తారు. థాంక్యూ కూడా అలాంటి సినిమానే అయినప్పటికీ ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేదు. అయితే ఈ సినిమాలో చైతన్య నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి.

నటన విషయంలో నాగచైతన్య చాలా ఇంప్రూవ్ అయ్యారని నెటిజన్లు భావిస్తున్నారు. అయితే థాంక్యూ ప్రమోషన్లలో భాగంగా చైతన్య సమంతతో విడాకుల గురించి, శోభితతో డేటింగ్ గురించి ప్రశ్నలు ఎదురు కాకుండా జాగ్రత్త పడుతున్నారు. జాతీయ మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్న చైతన్య వాళ్లకు కూడా షరతులు విధిస్తున్నారని తెలుస్తోంది. అయితే చైతన్య ప్రశ్నల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేయడం కూడా కరెక్ట్ కాదని కొంతమంది నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మీడియాను కొందరి గురించి అడగవద్దని చెప్పడం

వల్ల నాగచైతన్య ఏదో దాస్తున్నాడనే అభిప్రాయం చాలామందికి కలిగే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. నాగచైతన్య తన మనసులోని భావాలను దాచుకోకుండా వెల్లడిస్తే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. థాంక్యూ సినిమాకు ఫ్లాప్ టాక్ వచ్చినా నిర్మాత దిల్ రాజుకు నష్టాలు వచ్చే అవకాశాలు అయితే లేవని తెలుస్తోంది. థాంక్యూ సినిమా శాటిలైట్, డిజిటల్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడయ్యాయి. ఈ సినిమా రిజల్ట్ గురించి నిర్మాత దిల్ రాజుకు ముందే తెలుసని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

అయితే ప్రమోషన్స్ చేయడం ద్వారా థాంక్యూ సినిమా కలెక్షన్లు పుంజుకునే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఈ మధ్య కాలంలో దిల్ రాజు నిర్మిస్తున్న సినిమాల విషయంలో ఆయన జడ్జిమెంట్ తప్పుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. దిల్ రాజు తర్వాత ప్రాజెక్ట్ లతో నిర్మాతగా విజయాలను అందుకుంటారేమో చూడాల్సి ఉంది.

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus