Rajamouli: అంచనాలను అందుకోవడం జక్కన్నకు సులువు కాదా?

స్టూడెంట్ నంబర్1 నుంచి ఆర్ఆర్ఆర్ వరకు అపజయమెరుగని దర్శకునిగా రాజమౌళికి పేరుంది. రాజమౌళి సినిమా అంటే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించడంతో పాటు కలెక్షన్ల విషయంలో రికార్డులు క్రియేట్ అవుతాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే జక్కన్నకు కూడా ప్రస్తుతం అంచనాలను అందుకోవడం సులువు కాదు. బాహుబలి2 సినిమాతో పోల్చి చూస్తే ఆర్ఆర్ఆర్ ఎన్నో విషయాల్లో మెప్పించినా కొంతమంది ప్రేక్షకులు మాత్రం పెదవి విరిచారు. మరోవైపు ప్రశాంత్ నీల్, శంకర్, లోకేశ్ కనగరాజ్ రాజమౌళికి గట్టి పోటీ ఇస్తున్నారు.

సాధారణ కథలతో తెరకెక్కిన సినిమాలను ప్రేక్షకులు ఆదరించే రోజులు పోయాయి. రాజమౌళికి సైతం భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో అంచనాలను అందుకోవడం సులువు కాదు. జక్కన్న కథ, కథనంపై మరింత దృష్టి పెట్టి కొత్త టెక్నాలజీలను వినియోగించుకుని మహేష్ తో సినిమాను తెరకెక్కించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మహేష్ కు జక్కన్న కెరీర్ బెస్ట్ హిట్ ఇవ్వాలని అదే సమయంలో ఎలాంటి విమర్శలు రాకుండా జాగ్రత్త పడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మహేష్ జక్కన్న కాంబో నుంచి హాలీవుడ్ రేంజ్ మూవీని కోరుకుంటున్నామని ఫ్యాన్స్ చెబుతున్నారు.

జక్కన్నతో సినిమా అంటే నిర్మాతలు సైతం ఖర్చు విషయంలో అస్సలు రాజీ పడటం లేదు. 400 కోట్ల రూపాయలతో బడ్జెట్ తో తెరకెక్కాల్సిన ఆర్ఆర్ఆర్ బడ్జెట్ కరోనా వల్ల ఊహించని స్థాయిలో పెరిగింది. అయితే మహేష్ మూవీ ఆర్ఆర్ఆర్ కంటే ఎక్కువ బడ్జెట్ తో తెరకెక్కనుంది పదేళ్ల క్రితం మహేష్ జక్కన్న కాంబో మూవీ ఫిక్స్ కాగా వేర్వేరు కారణాల వల్ల ఈ సినిమా ఆలస్యమైంది. మహేష్ జక్కన్న కాంబో మూవీలో నటీనటుల గురించి క్లారిటీ రావాల్సి ఉంది.

కేఎల్ నారాయణ నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మహేష్ రాజమౌళి సినిమా పూర్తైన తర్వాతే కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించే ఛాన్స్ అయితే ఉంది.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus