Mahesh Babu, Trivikram: మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ ప్రత్యేకత ఇదే!

మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కనున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్రివిక్రమ్ ఈ సినిమా కచ్చితంగా సక్సెస్ సాధించేలా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది. కేజీఎఫ్, కేజీఎఫ్2 సినిమా కోసం పని చేసిన ఫైట్ మాస్టర్లు మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీకి పని చేయనున్నారని తెలుస్తోంది.

ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కిన కేజీఎఫ్ ఛాప్టర్2 సినిమా అంచనాలకు మించి విజయం సాధించిందనే సంగతి తెలిసిందే. ఈ సినిమా సక్సెస్ సాధించడంలో యాక్షన్ సన్నివేశాలు కీలక పాత్ర పోషించాయి. ఫైట్ మాస్టర్లు అన్బు – అరివు మహేష్ త్రివికమ్ మూవీకి ఓకే చెప్పారని తెలుస్తోంది. ఈ ఫైట్ మాస్టర్లు పని చేసిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించాయి. విక్రమ్ సినిమాకు కూడా వీళ్లే ఫైట్ మాస్టర్లుగా పని చేశారు.

శంకర్ రామ్ చరణ్ కాంబో మూవీకి ఇప్పటికే పని చేస్తున్న అన్బు అరివు మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీకి కూడా పని చేస్తుండటంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. రాబోయే రోజుల్లో వీళ్లిద్దరూ మరింత బిజీ అయ్యే అవకాశం అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. తెలుగులో ఈ ఫైట్ మాస్టర్లకు వరుసగా ఆఫర్లు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. 150 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో మహేష్ త్రివిక్రమ్ కాంబో సినిమా తెరకెక్కే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

హారిక హాసిని క్రియేషన్స్ నిర్మాతలు ఖర్చు విషయంలో రాజీ పడకుండా ఈ సినిమాను నిర్మించడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా తన రేంజ్ ను మరింత పెంచే విధంగా త్రివిక్రమ్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సినిమాసినిమాకు మహేష్, త్రివిక్రమ్ మార్కెట్ అంతకంతకూ పెరుగుతోంది. త్రివిక్రమ్ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా సక్సెస్ లను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus