SSMB28: వామ్మో.. త్రివిక్రమ్ మహేష్ మూవీని అలా ప్లాన్ చేశారా?

మహేష్ త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాపై భారీ అంచనాలు ఏర్పడగా ఈ సినిమాకు సంబంధించి టైటిల్ ఫైనల్ కాలేదనే సంగతి తెలిసిందే. ఈ సినిమా 2024 సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుండగా ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచే ఛాన్స్ అయితే ఉందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే ఈ సినిమాకు వీరసింహారెడ్డి మూవీకి లింక్ ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. తండ్రీకొడుకు పాత్రల్లో మహేష్ కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. ఎస్.జె.సూర్య డైరెక్షన్ లో తెరకెక్కిన నాని సినిమాలో మహేష్ కొన్ని నిమిషాల పాటు తండ్రీకొడుకుల పాత్రల్లో కనిపించారు.

అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోలేదు. సాధారణంగా మహేష్ బాబు ప్రతి సినిమాలో ఒకే తరహా లుక్ లో కనిపిస్తారని ఇండస్ట్రీలో విమర్శ ఉంది. త్రివిక్రమ్ సినిమాతో ఆ విమర్శకు కూడా చెక్ పెట్టాలని మహేష్ బాబు భావిస్తుండటం గమనార్హం. అయితే మహేష్ ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో నటిస్తున్నట్టు అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. మరోవైపు త్రివిక్రమ్ అరవింద సమేత, అల వైకుంఠపురములో సినిమాల తర్వాత డైరెక్షన్ లో తెరకెక్కిస్తున్న సినిమా ఇదే కావడం గమనార్హం.

పూజా హెగ్డే, శ్రీలీల ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం పూజా హెగ్డే, శ్రీలీల భారీ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకున్నారు. మహేష్ ఈ సినిమా డ్యూయల్ రోల్ లో నటిస్తే ఫ్యాన్స్ సైతం హ్యాపీగా ఫీలయ్యే అవకాశం ఉంటుంది.

వీరసింహారెడ్డి సినిమాలో బాలయ్య తండ్రీకొడుకు పాత్రల్లో నటించి మెప్పించగా మహేష్ (SSMB28) సైతం అదే మ్యాజిక్ ను రిపీట్ చేస్తారో లేదో చూడాల్సి ఉంది. మహేష్ రెమ్యునరేషన్ సైతం భారీ రేంజ్ లో ఉంది. వరుస విజయాలతో మహేష్ సత్తా చాటాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus