Amala, Nagarjuna: అమల రెండో బిడ్డను కనకపోవడానికి అదే కారణమా?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీ కపుల్స్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో అక్కినేని నాగార్జున అమల దంపతులు ఒకరు చెప్పాలి. నాగార్జున అమలను రెండో వివాహం చేసుకున్నప్పటికీ వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఎందరికో ఆదర్శంగా ఉన్నారు. అమలా సైతం పెళ్లి కాకముందు హీరోయిన్ గా పలు సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక ఈమె హీరోయిన్ గా మంచి సక్సెస్ సాధించిన సమయంలోనే నాగార్జున తనని రెండవ వివాహం చేసుకున్నారు.

అయితే అమల నాగార్జునను వివాహం చేసుకోవడం నాగేశ్వరరావుకు ఏమాత్రం ఇష్టం లేదని తెలుస్తుంది. అయితే నాగార్జున అమల దంపతులకు అమ్మాయి పుట్టాలని కోరిక బలంగా ఉండేదట ఈ క్రమంలోనే అఖిల్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత అమ్మాయి పడుతుందని భావించారు. కానీ అఖిల్ పుట్టారని పలు సందర్భాలలో నాగార్జున తెలిపారు. ఇలా అఖిల్ పుట్టడంతో తదుపరి అమ్మాయి అయితే బాగుంటుందని భావించారు.

కానీ మరొక బిడ్డను కనడానికి అమల ఏమాత్రం ఇష్టపడటం లేదట తనకు ఒక బిడ్డ ఉన్నారని ఎవరు చెప్పారు నాకు ఇద్దరు బిడ్డలు ఉన్నారు. నాగచైతన్య కూడా నాకు బిడ్డతో సమానమే అంటూ ఈమె మరొక బిడ్డను కనడానికి ఏమాత్రం ఇష్టపడలేదని ఓ సందర్భంలో వెల్లడించారు. ఇలా నాగచైతన్యను తన కన్న బిడ్డ అంటూ అమల భావించడంతో నాగేశ్వరరావు ఎంతో సంబరపడ్డారని ఆ క్షణం నుంచి తనని కోడలిగా యాక్సెప్ట్ చేశారనీ తెలుస్తోంది.

అమల (Amala) కూడా నాగార్జునను వివాహం చేసుకున్న తర్వాత సినిమా ఇండస్ట్రీకి పూర్తిగా దూరమయ్యారు. కేవలం ఇంటిపట్టునే ఉంటూ ఇంటి బాధ్యతలను ఎంతో చక్కగా నిర్వర్తిస్తూ పిల్లల బాధ్యతలను నిర్వర్తించారు.ఇక ప్రస్తుతం నాగచైతన్య అఖిల్ ఇద్దరు కూడా ఇండస్ట్రీలో హీరోలుగా కొనసాగుతూ సక్సెస్ సాధించడం కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus