ఆదిపురుష్ (Adipurush) సినిమాలో రావణుని పాత్రలో నటించిన సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) పై సినిమా రిలీజ్ తర్వాత తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. ఆ సమయంలో వచ్చిన నెగిటివిటీ వల్ల సైఫ్ కు తెలుగులో కొత్త ఆఫర్లు రావడం కష్టమేనని చాలామంది భావించారు. అయితే దేవరలో (Devara) మెయిన్ విలన్ భైరా రోల్ లో నటించే అవకాశం రావడం సైఫ్ అలీ ఖాన్ కు ఎంతగానో ప్లస్ అయిందని చెప్పవచ్చు.
దేవర మూవీ కొంతమంది ప్రేక్షకులకు నచ్చకపోయినా సైఫ్ యాక్టింగ్ మాత్రం తమకు ఎంతగానో నచ్చిందని వాళ్లు చెబుతుండటం గమనార్హం. సైఫ్ అలీ ఖాన్ కు తెలుగులో ఎక్కువ సంఖ్యలో ఆఫర్లు వస్తున్నాయని తెలుస్తోంది. అయితే సైఫ్ అలీ ఖాన్ రెమ్యునరేషన్ ఒకింత భారీ స్థాయిలో ఉంది. దేవర మూవీకి సైతం ఆయన 13 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ ను అందుకోవడం జరిగింది.
ప్రభాస్ (Prabhas) స్పిరిట్ (Spirit) మూవీలో సైఫ్ అలీ ఖాన్ నటిస్తారంటూ ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. భారీ ప్రాజెక్ట్ లకు మాత్రమే సైఫ్ అలీ ఖాన్ బెస్ట్ ఆప్షన్ అవుతారని సాధారణ ప్రాజెక్ట్ లలో ఆయన నటించే అవకాశం అయితే లేదని తెలుస్తోంది. సైఫ్ అలీ ఖాన్ కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది. పాత్రల ఎంపిక విషయంలో సైతం సైఫ్ అలీ ఖాన్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
దేవర మూవీ కమర్షియల్ గా హిట్ కావడం సైఫ్ అలీ ఖాన్ కు ఎంతగానో ప్లస్ అయిందని చెప్పవచ్చు. దేవర సీక్వెల్ లో సైతం సైఫ్ అలీ ఖాన్ పాత్రకు ఒకింత ఎక్కువగానే ప్రాధాన్యత ఉంటుందని సమాచారం అందుతోంది. దేవర సీక్వెల్ కచ్చితంగా తెరకెక్కుతుందని ఒకింత భారీ బడ్జెట్ తోనే ఈ సినిమా తెరకెక్కనుందని భోగట్టా. దేవర సినిమా సండే కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో చూడాలి.