Allu Arjun: స్టార్ హీరో అల్లు అర్జున్ డెడికేషన్ కు హ్యాట్సాఫ్ అనాల్సిందే

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి, ఆయన డెడికేషన్ గురించి ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా కోసం అల్లు అర్జున్ పడే కష్టం అంతాఇంతా కాదు. అల్లు అర్జున్ కు సోషల్ మీడియాలో సైతం మైండ్ బ్లాంక్ అయ్యే రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం పుష్ప ది రూల్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న బన్నీ ఈ సినిమా కోసం పడుతున్న కష్టం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

గంగమ్మ తల్లి సీక్వెన్స్ కోసం అల్లు అర్జున్ ఏకంగా 51 టేకులు తీసుకున్నారని సమాచారం అందుతోంది. అమ్మవారి హావభావాలతో చేసే ప్రతి మూమెంట్ పర్ఫెక్ట్ గా రావాలని బన్నీ ఇంత కష్టపడ్డారని తెలుస్తోంది. పుష్ప ది రూల్ తో బన్నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కుతుందని అభిమానులు భావిస్తున్నారు. బన్నీ ఖాతాలో రాబోయే రోజుల్లో మరిన్ని భారీ సక్సెస్ లు చేరాలని ఫ్యాన్స్ చెబుతున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు ఈ సినిమా షూటింగ్ అనుకున్న విధంగా పూర్తయ్యేలా ప్లాన్ చేశారని తెలుస్తోంది. బన్నీ దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ మ్యూజిక్ పరంగా ప్రేక్షకులను ఎప్పుడూ నిరాశకు గురి చేయలేదు. పుష్ప ది రూల్ సాంగ్స్ కూడా యూట్యూబ్ షేక్ అయ్యేలా ఉండబోతున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సుకుమార్ సినిమా అంటే దేవిశ్రీ ప్రసాద్ మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటారు.

పుష్ప ది రైజ్ సాంగ్స్ యూట్యూబ్ లో రికార్డ్ స్థాయిలో వ్యూస్ సొంతం చేసుకున్నాయి. పుష్ప ది రూల్ సినిమాకు సంబంధించి త్వరలో మరిన్ని క్రేజీ అప్ డేట్స్ రానున్నాయని సమాచారం అందుతోంది. బన్నీ ఈ సినిమాకు కెరీర్ హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని భోగట్టా. పుష్ప2 హిందీ వెర్షన్ 500 కోట్ల రూపాయల రేంజ్ లో కలెక్షన్లను సాధించే ఛాన్స్ ఉందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus