టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ కు (Ram Charan) ఇప్పటికే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉందనే సంగతి తెలిసిందే. రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ (Game Changer) మూవీ ఈ ఏడాది సెకండాఫ్ లో విడుదల కానుంది. నవంబర్ నెలలో ఈ సినిమా విడుదల కానుందని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. గేమ్ ఛేంజర్ సినిమా నార్త్ ఇండియా హక్కులు 75 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది.
అదే సమయంలో ఇండియన్2 (Indian 2) సినిమా నార్త్ ఇండియా హక్కులు 20 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని భోగట్టా. ఇండియన్2 నార్త్ రైట్స్ తో పోలిస్తే దాదాపుగా 4 రెట్లు ఎక్కువ మొత్తానికి గేమ్ ఛేంజర్ హక్కులు అమ్ముడవడం హాట్ టాపిక్ అవుతోంది. రామ్ చరణ్ క్రేజ్ చూసి ఇండస్ట్రీ వర్గాలు సైతం షాక్ కు గురవుతున్నాయి. గేమ్ ఛేంజర్ హిందీ వెర్షన్ హిట్టైతే మాత్రం చరణ్ కు తిరుగుండదని కామెంట్లు వినిపిస్తున్నాయి.
స్టార్ హీరో రామ్ చరణ్ కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు. వరుసగా మూడు సినిమాలను లైన్ లో పెట్టిన రామ్ చరణ్ ఈ మూడు సినిమాలతో భారీ విజయాలను అందుకుంటారేమో చూడాలి. అటు బుచ్చిబాబు (Buchi Babu Sana) ఇటు సుకుమార్ (Sukumar) కూడా సక్సెస్ లో ఉండటంతో చరణ్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లపై అంచనాలు పెరుగుతున్నాయి. రామ్ చరణ్ రెమ్యునరేషన్ ను మాత్రం మరీ భారీగా పెంచడం లేదని తెలుస్తోంది.
గేమ్ ఛేంజర్ సినిమాకు పరిమితంగా పారితోషికం తీసుకున్న రామ్ చరణ్ తర్వాత సినిమాలకు మాత్రం 80 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకోనున్నారని సమాచారం అందుతోంది. గేమ్ ఛేంజర్ సినిమాను ఐదు భాషల్లో రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండగా చరణ్ రాజమౌళి కాంబోలో మరిన్ని సినిమాలు రావాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.