Prabhas: ఫ్యాన్ చనిపోతే ప్రభాస్ చేసిన పనికి గ్రేట్ అనాల్సిందే!

  • May 27, 2024 / 06:32 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ (Prabhas) వరుస ప్రాజెక్ట్ లతో ప్రస్తుతం ఏ స్టార్ హీరో లేనంత బిజీగా ఉన్నారు. కల్కి (Kalki 2898 AD) , కన్నప్ప (Kannappa) సినిమాలతో ప్రభాస్ ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నారు. వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్ లో రాజాసాబ్ (The Rajasaab) మూవీ రిలీజ్ కానుంది. ప్రభాస్ తర్వాత సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండగా ప్రభాస్ కు ఇతర భాషల్లో సైతం ఊహించని స్థాయిలో క్రేజ్ పెరుగుతోంది. కరీంనగర్ జిల్లాకు చెందిన ప్రభాస్ ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షుడు రమేష్ కొన్ని రోజుల క్రితం మృతి చెందారు.

రమేష్ మరణ వార్త తెలిసిన ప్రభాస్ అభిమాని కుటుంబానికి తన పీఏ ద్వారా ఆర్థిక సహాయం చేసే ప్రయత్నం చేశారని తెలుస్తోంది. రమేష్ కుటుంబానికి అండగా నిలుస్తానని ప్రభాస్ నుంచి స్పష్టమైన హామీ లభించిందని సమాచారం అందుతోంది. రమేష్ పేరుతో కొన్ని కార్యక్రమాలు సైతం చేయాలని ప్రభాస్ భావిస్తున్నారని భోగట్టా. అభిమాని కుటుంబం గురించి ఇంతలా ఆలోచించే హీరోలు తక్కువగా ఉన్నారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

స్టార్ హీరో ప్రభాస్ ను ఎంత మెచ్చుకున్నా తక్కువేనని ఫ్యాన్స్ చెబుతున్నారు. కల్కి మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందని అతి త్వరలో ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం. కల్కి సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతుందని వార్తలు వినిపిస్తుండగా ఈ వార్తలకు సంబంధించి త్వరలో స్పష్టత వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం అందుతోంది.

ప్రభాస్ కు భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో సలార్ ను (Salaar) మించిన విజయాలు దక్కాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. సలార్2 మూవీ ఆగిపోలేదని మేకర్స్ నుంచి క్లారిటీ వచ్చిన సంగతి తెలిసిందే. ప్రభాస్ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus