Mahesh Babu: ఆ విషయంలో త్రివిక్రమ్ నిర్ణయం రైటేనా?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాలలో హీరోయిన్లను రిపీట్ చేస్తారు. త్రివిక్రమ్ తర్వాత సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా ఎంపికైన విషయం తెలిసిందే. మహేష్ బాబు ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. మహేష్ పూజా హెగ్డే కాంబినేషన్ లో తెరకెక్కిన మహర్షి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో మహేష్ పూజా హెగ్డే కాంబినేషన్ లో మరో సినిమా ఫిక్స్ అయినా ఫ్యాన్స్ నుంచి ఎక్కువగా నెగిటివ్ కామెంట్లు రాలేదు.

Click Here To Watch NOW

అయితే ప్రస్తుతం టాలీవుడ్ కోలీవుడ్ ఇండస్ట్రీలలో పూజా హెగ్డే పరిస్థితి అస్సలు బాలేదు. రాధేశ్యామ్, బీస్ట్ సినిమాల ఫలితాలు మహేష్ అభిమానులను టెన్షన్ పెడుతున్నాయి. ఆచార్య మూవీ రిజల్ట్ ఎలా ఉన్నా పూజా హెగ్డేకు ఈ సినిమా ప్లస్ అయ్యే అవకాశాలు అయితే లేవు. ఇతర హీరోయిన్లతో పోలిస్తే పూజా హెగ్డే రెమ్యునరేషన్ కూడా ఎక్కువ మొత్తం కావడం గమనార్హం. పూజా హెగ్డే విషయంలో త్రివిక్రమ్ నిర్ణయం రైటేనా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

జూన్ నెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే ఛాన్స్ అయితే ఉందని సమాచారం అందుతోంది. కేవలం 7 నుంచి 8 నెలల్లోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి కానుందని తెలుస్తోంది. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుంది. అయితే ఈ సినిమా పాన్ ఇండియా సినిమానా? కాదా? అనే ప్రశ్నకు మాత్రం సమాధానం తెలియాల్సి ఉంది. త్రివిక్రమ్ సరికొత్త కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించనున్నారని తెలుస్తోంది.

త్రివిక్రమ్ మహేష్ కాంబినేషన్ లో తెరకెక్కిన అతడు, ఖలేజా సినిమాలు మహేష్ అభిమానులకు ఎంతగానో నచ్చేశాయి. అయితే కమర్షియల్ గా ఖలేజా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. మహేష్ బాబుకు భారీ బ్లాక్ బస్టర్ ఇవ్వాలని త్రివిక్రమ్ ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టారని బోగట్టా.

ఆచార్య సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus