Jr NTR, Sai Pallavi: జూనియర్ ఎన్టీఆర్, సాయిపల్లవి మధ్య ఉన్న ఈ పోలిక తెలుసా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమా అక్టోబర్ నెల 10వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. దేవర ఆరు నెలలు వాయిదా పడినా ఇండస్ట్రీ హిట్ గా నిలిస్తే చాలని తమ ఎదురుచూపులకు తగ్గ ఫలితం దక్కాలని అభిమానులు ఫీలవుతున్నారు. దేవర సినిమా షూట్ జులై చివరినాటికి పూర్తయ్యే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. దసరాకు దేవర విడుదలైతే ఈ సినిమాకు రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు వస్తాయని చెప్పవచ్చు.

గురువారం రోజున దేవర మూవీ రిలీజ్ కానుండటంతో ఈ సినిమా లాంగ్ వీకెండ్ ను కూడా ఈ సినిమా సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంది. జూనియర్ ఎన్టీఆర్ ఏకంగా తొమ్మిది భాషలలో అనర్గళంగా మాట్లాడగలరనే సంగతి తెలిసిందే. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్, స్పానిష్ తారక్ మాట్లాడతారని తెలుస్తోంది. ఈ భాషలతో పాటు మరికొన్ని భాషలు సైతం తారక్ కు వచ్చని భోగట్టా.

అయితే జూనియర్ ఎన్టీఆర్ లా సాయిపల్లవి మల్టీ టాలెంటెడ్ అని సాయిపల్లవి కూడా ఎనిమిది భాషలు మాట్లాడగలరని తెలుస్తోంది. ఎక్కువ సంఖ్యలో భాషలు మాట్లాడే విషయంలో జూనియర్ ఎన్టీఆర్, సాయిపల్లవి సేమ్ టు సేమ్ అని కామెంట్లు చేస్తున్నారు. డ్యాన్స్ విషయంలో సైతం ఎన్టీఆర్, సాయిపల్లవి అదుర్స్ అనిపిస్తారనే సంగతి తెలిసిందే. ఈ ఇద్దరి కాంబినేషన్ ను అభిమానులు కోరుకుంటున్నారు.

రాబోయే రోజుల్లో (Jr NTR) ఎన్టీఆర్, సాయిపల్లవి కాంబినేషన్ సాధ్యమవుతుందో లేదో చూడాల్సి ఉంది. ఈ కాంబినేషన్ వేరే లెవెల్ కాంబినేషన్ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కెరీర్ పరంగా బిజీ అవుతున్నారు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న తారక్ రెస్ట్ లేకుండా కష్టపడుతున్నారు. ఎన్టీఆర్ ఈ ఏడాది దేవర1, 2025లో వార్2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

ఊరిపేరు భైరవ కోన సినిమా రివ్యూ & రేటింగ్!

‘దయా గాడి దండయాత్ర’ కి 9 ఏళ్ళు!
ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus