Mahesh Babu, Rajamouli: మహేష్ జక్కన్న సినిమాకు అదిరిపోయే టైటిల్ ఫిక్స్.. బాగుందంటూ?

మహేష్ రాజమౌళి కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనుండగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరగుగుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతుండగా త్వరలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఈ సినిమాకు సంబంధించిన విషయాలను, విశేషాలను జక్కన్న అభిమానులతో పంచుకోనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాకు మహారాజా, చక్రవర్తి అనే టైటిల్స్ ను పరిశీలిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో ఈ టైటిల్స్ వైరల్ అవుతుండగా ఈ టైటిల్స్ బాగానే ఉన్నాయని ఫ్యాన్స్ నుంచి సైతం అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమా పాన్ వరల్డ్ మూవీ కావడంతో అన్ని భాషలకు ఈ టైటిల్స్ సూట్ అవుతాయని చెప్పవచ్చు. అయితే మేకర్స్ నుంచి స్పష్టత వస్తే మాత్రమే టైటిల్ కు సంబంధించి జరుగుతున్న ప్రచారంలో నిజానిజాలు తెలిసే అవకాశం ఉంది. అటు మహేష్ కానీ ఇటు రాజమౌళి కానీ ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి కామెంట్లు చేయడం లేదు. మహేష్, జక్కన్న దాదాపుగా ఐదేళ్ల సమయం కేటాయిస్తున్న ఈ సినిమాలో గ్రాఫిక్స్ కూడా అదుర్స్ అనేలా ఉండనున్నాయని సమాచారం అందుతోంది.

ఈ సినిమాకు సంబంధించిన టెక్నీషియన్లను ఫైనల్ చేశారని పీఎస్ వినోద్ ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా పని చేయనున్నారని సమాచారం అందుతోంది. మహేష్ జక్కన్న కాంబోలో తెరకెక్కుతున్న తొలి సినిమా ఇదే కావడం గమనార్హం. ఈ సినిమాతో మహేష్ బాబు 3000 కోట్ల రూపాయల రేంజ్ కలెక్షన్లను సొంతం చేసుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

మహేష్ బాబు (Mahesh Babu) రాజమౌళి కాంబో మూవీలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని విదేశాల్లో మెజారిటీ సీన్లను షూట్ చేస్తారని తెలుస్తోంది. త్వరలో ఈ సినిమాకు సంబంధించి మరిన్ని క్రేజీ అప్ డేట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. మహేష్ రాజమౌళి కాంబో మూవీ విదేశీ భాషల్లో కూడా విడుదల కావాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

ఊరిపేరు భైరవ కోన సినిమా రివ్యూ & రేటింగ్!

‘దయా గాడి దండయాత్ర’ కి 9 ఏళ్ళు!
ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus