Varun Tej: ఆ అక్షరం సినిమాలు వరుణ్ తేజ్ కు మైనస్ అవుతున్నాయా.. ఏమైందంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న హీరోలలో వరుణ్ తేజ్ ఒకరు. హ్యాండ్సప్ అనే సినిమాలో బాల నటుడిగా నటించిన వరుణ్ తేజ్ ముకుంద సినిమాతో హీరోగా కెరీర్ ను మొదలుపెట్టారు. ముకుంద సినిమాతో యావరేజ్ ఫలితాన్ని అందుకున్న వరుణ్ తేజ్ కంచె సినిమాతో భారీ సక్సెస్ ను అందుకున్నారు. ఈ సినిమా తర్వాత వరుణ్ నటించిన మిస్టర్, లోఫర్ సినిమాలు ఆశించిన ఫలితాలను సొంతం చేసుకోలేదు.

ఫిదా, తొలిప్రేమ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ విజయాలను అందుకున్న వరుణ్ తేజ్ కు అంతరిక్షం 9000 కే.ఎం.పీ.హెచ్ సినిమాతో భారీ షాక్ తగిలింది. ఎఫ్2, గద్దలకొండ గణేష్ సినిమాలతో మళ్లీ వరుస విజయాలను అందుకున్న వరుణ్ తేజ్ కు గని సినిమా ఫలితం భారీ షాకిచ్చింది. అల్లు బాబీ నిర్మాతగా తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విషయంలో ఫెయిలైంది.

ఎఫ్3 సినిమాతో మరో హిట్ ను సొంతం చేసుకున్న వరుణ్ తేజ్ గాండీవదారి అర్జున సినిమాతో ఆశించిన ఫలితాన్ని సొంతం చేసుకోలేదు. అయితే గ అక్షరంతో తెరకెక్కి వరుణ్ తేజ్ నటించిన గని, గాండీవదారి అర్జున సినిమాలు ఆశించిన ఫలితాలను అందుకోకపోవడంతో గ అక్షరం వరుణ్ తేజ్ కు అచ్చిరాలేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వరుణ్ తేజ్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతోంది.

వరుణ్ తేజ్ (Varun Tej) కథల ఎంపికలో జాగ్రత్త పడాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ అయ్యేలా వరుణ్ తేజ్ కెరీర్ విషయంలో జాగ్రత్త వహించాలని అభిమానులు ఆశిస్తున్నారు. వరుణ్ తేజ్ కు లవ్ స్టోరీలు అచ్చొచ్చాయని ఫ్యాన్స్ చెబుతున్నారు. యూత్ ను ఆకట్టుకునే సినిమాలకు వరుణ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. వరుణ్ తేజ్ కెరీర్ ప్లానింగ్ ఏ విధంగా ఉండనుందో తెలియాల్సి ఉంది.

మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?

మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus