విక్టరీ వెంకటేశ్ (Venkatesh Daggubati) హీరోగా అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో వచ్చిన “సంక్రాంతికి వస్తున్నాం” (Sankranthiki Vasthunam) 2025లో టాలీవుడ్‌కు మొదటి ఘనవిజయాన్ని అందించింది. దిల్ రాజు (Dil Raju) నిర్మించిన ఈ సినిమా కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే కథ, వినోదం, భావోద్వేగాలతో బిగ్ హిట్‌గా నిలిచింది. సంక్రాంతి పండుగను పూర్తి స్థాయిలో క్యాష్ చేసుకుంటూ, మొదటి మూడు రోజుల్లోనే సినిమా బాక్సాఫీస్ వద్ద విజయఢంకా మోగించింది. లేటెస్ట్ కలెక్షన్ల విషయానికి వస్తే, ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 106 కోట్ల గ్రాస్ వసూళ్లను దాటి వెంకీ కెరీర్ లో ఒక రికార్డు క్రియేట్ చేసింది.
మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ఈ సినిమా, రెండవ రోజు కంటే మూడవ రోజు అత్యధిక స్థాయిలో టికెట్ బుకింగ్స్ పొందింది. మూడవ రోజు 29 కోట్ల గ్రాస్ వసూలు చేస్తూ, వెంకటేశ్ కెరీర్‌లో వేగవంతమైన 100 కోట్ల క్లబ్‌లో చేరిన చిత్రంగా రికార్డు సృష్టించింది. విదేశాల్లో కూడా ఈ సినిమా ప్రభావం చూపించింది. అమెరికాలో 1 మిలియన్ డాలర్ల మార్క్‌ను అత్యంత వేగంగా దాటిన వెంకటేశ్ చిత్రంగా నిలిచింది.
ఇది వెంకటేశ్ కెరీర్‌లో నాలుగో 1 మిలియన్ డాలర్ క్లబ్ సినిమా కావడం విశేషం. ఈ వసూళ్లు వెంకీ స్టార్‌డమ్‌ను మరింత పెంచాయి. సంక్రాంతి సీజన్‌ను పరిగణలోకి తీసుకుంటే, “సంక్రాంతికి వస్తున్నాం” (Sankranthiki Vasthunam) అన్ని వర్గాల ప్రేక్షకులను సంతృప్తిపరచి, డిస్ట్రిబ్యూటర్లకు లాభాలను తెచ్చి పెట్టింది.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మితమైన ఈ చిత్రం విడుదలైన మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసి, లాభాలను అందిస్తోంది. థియేటర్ల సంఖ్యను పెంచుతూ, పూర్తి రన్‌లో 200 కోట్లకు పైగా వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ అనలిస్ట్‌లు విశ్లేషిస్తున్నారు. ఇక వెంకీ కెరీర్‌లో ఈ సినిమా మరో బిగ్ హిట్ నిలిచింది.