Balakrishna, Ravi Teja: బాలయ్య, రవితేజ బాక్సాఫీస్ పోటీలో విజేత అతనేనా?

స్టార్ హీరో బాలకృష్ణ, మాస్ మహారాజ్ రవితేజ బాక్సాఫీస్ వద్ద చాలా సందర్భాల్లో పోటీ పడిన సంగతి తెలిసిందే. అయితే ఈ పోటీలో మెజారిటీ సందర్భాల్లో రవితేజకు విజయం దక్కింది. బాలయ్య, రవితేజ పోటీ పడితే ఆ పోటీ ఇండస్ట్రీలో ఆ పోటీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతుంది. అయితే దసరా పండుగ సమయంలో మరోసారి ఈ ఇద్దరు హీరోలు పోటీ పడనున్నారని స్పష్టత వచ్చేసింది. ఇప్పటికే రామ్ బోయపాటి కాంబో మూవీ దసరా కానుకగా ఫిక్స్ కాగా బాలయ్య అనిల్ రావిపూడి కాంబో మూవీ కూడా దసరా కానుకగా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.

రవితేజ నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు మూవీ కూడా దసరాకు థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. టైగర్ నాగేశ్వరరావు దసరా బరిలో చేరడంతో ఇతర సినిమాల నిర్మాతలు షాకవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ సినిమా కూడా అక్టోబర్ 20వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. బాలయ్య అనిల్ కాంబో మూవీ కూడా అదే డేట్ ను ఫిక్స్ చేసుకుంటే మాత్రం ఏ సినిమాకు వెళ్లాలనే విషయంలో ప్రేక్షకులకు కన్ఫ్యూజన్ ఏర్పడే అవకాశం ఉంది.

రవితేజ వరుసగా సినిమాలలో నటిస్తూ కెరీర్ పరంగా బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే. దసరాకు రిలీజయ్యే సినిమాలన్నీ అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి. ఎక్కువ సంఖ్యలో సినిమాలు విడుదలైతే ఆ సినిమాలకు థియేటర్ల విషయంలో కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. దసరాకు విడుదలవుతున్న సినిమాల బడ్జెట్ 250 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.

ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకుంటాయో చూడాల్సి ఉంది. బాలయ్య (Balakrishna) , రవితేజ మధ్య పోటీలో మెజారిటీ సందర్భాల్లో రవితేజ విజేతగా నిలిచినా ఈ దసరాకు మాత్రం ఇద్దరు హీరోలకు సక్సెస్ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus