Adi Reddy: ఈవారం ఎలిమినేషన్ లో బిగ్ బాస్ ఇచ్చే ట్విస్ట్ ఇదేనా..!

బిగ్ బాస్ హౌస్ లో 5వ వారం ఎలిమినేషన్ అనేది అత్యంత ఉత్కంఠంగా మారింది. ప్రస్తుతం ఈవారం నామినేషన్స్ లో 8మంది ఉన్నారు. ఇందులో అమ్మాయిలు ఈసారి సేఫ్ జోన్ లో ఉండటం విశేషంగా మారింది. ఫైమా, ఇనయ, మెరీనా , ఇంకా వాసంతీలు సేఫ్ గానే ఉన్నారు. ఈసారి అబ్బాయిల్లోనే ఎలిమినేషన్ అనేది జరగబోతోంది. ఇందులో బాలాదిత్య, చంటి, ఆదిరెడ్డి, ఇంకా అర్జున్ ఉన్నారు.వీళ్లలో ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది.

అన్ అఫీషియల్ పోలింగ్స్ లో ఫస్ట్ డే నుంచీ కూడా వీళ్ల నలుగురు డేంజర్ జోన్ లోనే ఉన్నారు. అర్జున్ కళ్యాణ్ , ఆదిరెడ్డి ఇద్దరూ కూడా బాలాదిత్య, చంటిలతో పోలిస్తే కొద్దిగా బెటర్ పొజీషన్ లోనే ఉన్నా, పెద్దగా ఓటింగ్ పర్సెంటేజ్ లో డిఫరెన్స్ మాత్రం లేదు. కాబట్టి, నలుగురులో ఎవ్వరైనా సరే ఎలిమినేట్ అయిపోవచ్చు. అయితే, వీరిలో పోలిస్తే ఇప్పుడు ఆదిరెడ్డిని బిగ్ బాస్ టీమ్ ఎలిమినేట్ చేసే ఛాన్స్ ఉందని సోషల్ మీడియాలో టాక్ మొదలైంది.

బాలాదిత్య, చంటి, అర్జున్ కళ్యాణ్ ముగ్గుర్ని సేఫ్ చేసి ఆదిరెడ్డిని పంపించేస్తారా అని అంటున్నారు. ఎందుకంటే, ఈవారం ఈ ముగ్గురుతో పోలిస్తే ఆదిరెడ్డి పెద్దగా పెర్ఫామ్ చేసింది లేదు. అంతేకాదు, ఎంటర్ టైన్మెంట్ టాస్క్ లో కూడా పెర్ఫామన్స్ లేదు. గత వారం కూడా ఆదిరెడ్డి నుంచీ అద్భుతమైన పెర్ఫామన్స్ ఏదీ రాలేదు. బొమ్మల టాస్క్ లో కూడా వెనకబడ్డాడు. మరి ఇలా మూడు వారాల నుంచూ ఆదిరెడ్డి అనుకున్న స్థాయిలో రాణించడం లేదు.

అందుకే, బిగ్ బాస్ టీమ్ ఆదిరెడ్డిని ఎలిమినేట్ చేస్తారా అని అనిపిస్తోంది. కానీ, అన్ అఫీషియల్ పోలింగ్స్ లో మాత్రం ఆఖరి రోజు చాలామంది పర్సెంటజ్ లు తగ్గిపోయాయి. ఇందులో వాసంతీ కూడా లీస్ట్ లోకి వచ్చే అవకాశం కూడా ఉంది. హాట్ స్టార్ అఫీషియల్ ఓటింగ్ లో ఒకవేళ అమ్మాయిల్లో మెరీనా, వాసంతీ ఇద్దరూ లీస్ట్ లో ఉంటే మాత్రం వీరిద్దరిలో ఎలిమినేషన్ జరగచ్చు.

కానీ, చాలా సైట్స్ లో , పోలింగ్ ఛానల్స్ లో మాత్రం అమ్మాయిలు సేఫ్ జోన్ లోనే ఉన్నారు. బాలాదిత్య, చంటి ఇద్దరూ ఓటింగ్ లో వెనకబడ్డారు. మరి వీరిద్దరిలో ఒకరిని ఎలిమినేట్ చేస్తే మాత్రం ఆదిరెడ్డి సేఫ్ అయినట్లే. అలాకాకుండా, ఆదిరెడ్డిని ఎలిమినేట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా బిగ్ బాస్ ఇచ్చేది బిగ్ ట్విస్టే అవుతుంది. మరి ఈవారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది చూడాలి. అదీ మేటర్.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus