Bigg Boss Telugu 6: కెప్టెన్ ఎలిమినేట్ అవ్వబోతున్నాడా.. బిగ్ బాస్ బిగ్గెస్ట్ ట్విస్ట్ ఇదే..!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 రెండోవారమే ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముఖ్యంగా ఈవారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు అనేది అత్యంత ఆసక్తిగా మారింది. సోషల్ మీడియాలో ఇప్పటివరకూ జరుగుతున్న పోలింగ్ ప్రకారం అయితే ముగ్గురు డేంజర్ జోన్ లో ఉన్నారు. అభినయశ్రీతో పాటుగా రాజ్, ఇంకా షానీలు డేంజర్ జోన్ లో ఉన్నారు. అయితే, హాట్ స్టార్ అఫీషియల్ ఓటింగ్ అనేది వేరేలాగా ఉంటుంది. అందులోనూ బిగ్ బాస్ టీమ్ నిర్వాహకులు తమకి నచ్చినట్లుగా పార్టిసిపెంట్స్ ని ఎలిమినేట్ చేస్తునే ఉంటారు.

అఫీషియల్ ఓటింగ్ ప్రకారమే చేశామని ఎనౌన్స్ కూడా చేస్తారు. గత సీజన్ లో యాంకర్ రవి ఎలిమినేషన్ అనేది బిగ్ బాస్ బిగ్గెస్ట్ ట్విస్ట్ అయ్యింది. అలాగే, ఇప్పుడు సేమ్ టు సేమ్ ట్విస్ట్ ఇవ్వబోతున్నారా అనేది ఆసక్తిగా మారింది. ఈవారం నామినేషన్ లో మొత్తం ఎనిమిది మంది ఉన్నారు. అబ్బాయిల్లో రేవంత్, ఆదిరెడ్డి, రోహిత్ కపుల్, షానీ, ఇంకా రాజ్ ఉన్నారు. అమ్మాయిల్లో గీతు, అభినయశ్రీ , ఫైమా ఉన్నారు. వీళ్లలో అన్ అఫీషియల్ పోలింగ్ ప్రకారం చూసినట్లయితే, రేవంత్ టాప్ పొజీషన్ లో సేఫ్ జోన్ లో ఉన్నాడు.

ఆ తర్వాత ఫైమా , రోహిత్ – మెరీనా కపుల్ కూడా సేఫ్ గానే ఉన్నారు. ఇక్కడ్నుంచే మిగతా పార్టిసిపెంట్స్ పొజీషన్స్ అనేవి ప్రతిరోజూ పోలింగ్ లో మారుతూ వచ్చాయి. ఆదిరెడ్డి, గీతు ఇద్దరు రివ్యూవర్స్ కూడా సేఫ్ గానే ఉన్నట్లుగా అఫీషియల్ పోలింగ్ చెప్తోంది. కానీ, డేంజర్ జోన్ లో ఉన్న ముగ్గురికీ వీళ్లకి పర్సెంటేజ్ లో పెద్దగా తేడా లేదు. కాబట్టి బిగ్ బాస్ ఎవరినైనా ఈవారం ఎలిమినేట్ చేసే ఛాన్స్ లేకపోలేదు. గతవారం అంటే మొదటి వారం ఎలిమినేషన్ లేదు కాబట్టి, డబుల్ ఎలిమినేషన్ చేసే ఛాన్స్ ఉందా అనేది ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠని కలిగిస్తోంది.

ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ చేస్తే మాత్రం రివ్యూవర్స్ లో నుంచీ ఒకర్ని ఇంటికి పంపించేయచ్చు. అదే జరిగితే, గీతు- ఆదిరెడ్డి ఇద్దరిలో ఒకరు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత డేంజర్ జోన్ లో ఉన్న షానీ, ఇంకా రాజ్ , అభినయశ్రీలలో ఒకరు ఎలిమినేట్ అవ్వొచ్చు. ఒకవేళ సింగిల్ ఎలిమినేషన్ ఉంటే రాజ్ , షానీ ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. అయితే, ఈవారం రాజ్ కెప్టెన్ అయ్యాడు కాబట్టి ఏమైనా కన్సిడర్ చేస్తారా ? లేదంటే ఎలిమినేట్ చేసేస్తారా అనేది చూడాలి.

అలాగే, అభినయశ్రీ కూడా లాస్ట్ వీక్ డేంజర్ జోన్ లో ఉంది. లాస్ట్ మినిట్ లో సేఫ్ అయ్యింది. కాబట్టి అభినయశ్రీకి, రాజ్ కి ఇంకో ఛాన్స్ ఇవ్వాలని అనుకుంటే ఖచ్చితంగా షానీ ఎలిమినేట్ అవుతాడు. అన్ అఫీషియల్ పోలింగ్ చూస్తే షానీ ఓటింగ్ లో చాలా వెనకబడ్డాడు. అందరికంటే కూడా లీస్ట్ లో ఉన్నాడు. ఏ రకంగా చూసినా షానీకి ఈవారం ఎలిమినేషన్ గండమనే చెప్పాలి. మరి ఈవారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా. లేదా సింగిల్ ఎలిమినేషన్ ఉంటుందా అనేది చూడాలి. అదీ మేటర్.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus