బిగ్ బాస్ హౌస్ లో 11వ వారం కెప్టెన్సీ రేస్ అనేది హౌస్ మేట్స్ మద్యలో తగాదాలు పెట్టింది. ట్రక్ టాస్క్ ఆడేటపుడు ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది హౌస్ మేట్స్ పాయింట్స్ చెప్పారు. ఇందులో కీర్తి ఇంకా శ్రీహాన్ ఇద్దరికీ గట్టి వాదన పడింది. దీంతో కెప్టెన్సీ అర్హత సాధించేందుకు హౌస్ మేట్స్ మద్యలో పోటీ నెలకొంది. ఫైనల్ గా కెప్టెన్సీ పోటీదారులుగా రేవంత్, ఇనాయ, శ్రీహాన్, రోహిత్, ఇంకా ఆదిరెడ్డి అయ్యారు.
వీళ్లకి బిగ్ బాస్ బాల్ ఇచ్చి ఎవరి గోల్ పోస్ట్ లో వాళ్లు గోల్ అవ్వకుండా కాపాడుకోవాలని చెప్పాడు. దీనికోసం గట్టి పోటీ పడింది. మొదటి రౌండ్ లో రోహిత్ ఎలిమినేట్ అయ్యాడు. ఆ తర్వాత రౌండ్ లో ఇనాయా కూడా గేమ్ నుంచీ అవుట్ అయ్యింది. నిజానికి వీరిద్దరూ కూడా కెప్టెన్సీ పోటీదారులు అయ్యారు కానీ, ఇంతవరకూ ఇంటి కెప్టెన్ అవ్వలేదు. కానీ, ఈసారి కూడా వాళ్లకి అవకాశం రాలేదు.
ఏదైనా హౌస్ మేట్స్ సపోర్ట్ టాస్క్ వచ్చి ఉంటే ఖచ్చితంగా కెప్టెన్సీ రేస్ లో పోటీ పడేవారు. కెప్టెన్ అయ్యేవారు. కానీ, ఆ అవకాశం లేకుండా పోయింది. దీంతో మొదటి రౌండ్స్ లోనే వీరిద్దరూ ఎలిమినేట్ అయిపోయారు. మిగిలి శ్రీహాన్, ఆదిరెడ్డి, రేవంత్ ల మద్యన గట్టి పోటీ జరిగింది. అయితే, లాస్ట్ వరకూ శ్రీహాన్ ఇంకా రేవంత్ ఇద్దరే ఉన్నప్పుడు ఎవరు ఇంటి తదుపరి కెప్టెన్ అవుతారా అనే ఉత్కంఠ నెలకొంది.
ఫైనల్ గా టాస్క్ లో గెలిచి రేవంత్ మరోసారి ఇంటి కెప్టెన్ అయ్యాడు. ప్రస్తుతం ఈవారం రేవంత్ నామినేషన్స్ లో ఉన్నా కూడా సేఫ్ జోన్ లో ఉన్నాడు. ఇక తర్వాత వారం కూడా కెప్టెన్ అవ్వడం వల్ల నామినేషన్స్ నుంచీ సురక్షితుడు అవుతాడు. దీంతో టాప్ – 5 పై కన్నేశాడు రేవంత్. ఇలాగే మరోవారం తన ఇమ్యూనిటీని కాపాడుకుంటే ఫైనల్ టాప్ 5 లోకి దూసుకు వెళ్లిపోతాడు. అదీ మేటర్.