బిగ్ బాస్ హౌస్ లో 8వారాలు గడిచిపోయాయి. సగం షో అయిపోయినా కూడా హౌస్ మేట్స్ మద్యన ఇంకా గొడవలు అనేవి జరుగుతూనే ఉన్నాయి. ఒకరినొకరు ఛాలెంజ్ చేస్కుంటూనే ఉన్నారు. ఇక వరెస్ట్ పెర్ఫామర్ గా ప్రతివారం ఎవరో ఒకర్ని ఎంచుకోవడం అనేది బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడూ జరిగేదే. ఇందులో భాగంగా టాస్క్ లో సరిగ్గా పెర్ఫామ్ చేయని వాళ్లని , హౌస్ లో తమ పనులు సక్రమంగా నిర్వర్తించని వాళ్లని జైలుకి పంపిస్తూ ఉంటారు.
హౌస్ మేట్స్ ఓటింగ్ తోనే ప్రతి వారం ఇది జరుగుతుంది. అయితే, ఈసారి లాక్డౌన్ టాస్క్ లో భాగంగా సన్నీ శ్రీరామ్ పైన, అలాగే అనీమాస్టర్ పైన విరుచుకుపడ్డాడు. వాళ్లిద్దరితో వాగ్వివాదం చేస్తూ వచ్చాడు. టాస్క్ లో పెర్ఫామన్స్ బాగున్నా కూడా సన్నీని అలాగే కాజల్ ని ఇద్దర్నీ హౌస్ మేట్స్ వరెస్ట్ పెర్ఫామర్స్ గా ఎంపికచేసినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు, ఈవారం అంతా సన్నీ కెప్టెన్ గా ఉన్నాడు
కాబట్టి సన్నీ కెప్టెన్సీ పైన కూడా కామెంట్స్ చేస్తూ వరెస్ట్ పెర్ఫామర్ గా హౌస్ మేట్స్ సన్నీని ఎంపిక చేసినట్లుగా సమాచారం.ఇక కాజల్ కి ఇంకా సన్నీకి ఈక్వల్ ఓటింగ్స్ జరిగాయని ఇందులో భాగంగా సన్నీ జైలుకి వెళ్లాడని సమాచారం తెలుస్తోంది.
Most Recommended Video
సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్ టాప్ భామల రెమ్యూనరేషన్ ఎంతంటే?