Bigg Boss: ఈవారం డబుల్ ఎలిమినేష్ ఉందా ? బిగ్ బాస్ ఇచ్చే ట్విస్ట్ ఇదేనా..!

బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ లో ఆరోవారం నామినేషన్స్ లో ఉన్నవారికి షాకింగ్ తప్పదా అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో ఈవారం డబుల్ ఎలిమినేషన్ ఉండచ్చని అంచనాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే, లాస్ట్ వీక్ ముమైత్ ఖాన్ అనూహ్యంగా హౌస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ఫస్ట్ వీక్ లోనే ముమైత్ ఖాన్ ఎలిమినేట్ అయిపోయింది. ఆ తర్వాత ఐదోవారం జడ్జిగా టాస్క్ లో వచ్చిందని అనుకున్నారు అందరూ.

కానీ, హౌస్ లో రీ ఎంట్రీ ఇచ్చిందని తర్వాత తెలిసింది. అయితే, ఇప్పుడు ముమైత్ రాకతో ఖచ్చితంగా ఏదో ఒకవారం డబుల్ ఎలిమినేషన్ అనేది పెట్టక తప్పదు. అయితే, అది ఈవారమే ఉండచ్చని అంచనాలు వేస్తున్నారు. ఒక్కసారి మనం నామినేషన్స్ లో ఓటింగ్ చూసినట్లయితే., అన్ అఫీషియల్ ఓటింగ్ లెక్కల ప్రకారం.., బిందు మాధవి టాప్ ప్లేస్ లో సేఫ్ జోన్ లోనే ఉంది. ఆ తర్వాత యాంకర్ శివ కూడా బిందు మాధవిలాగానే సేఫ్ గానే ఉన్నాడు. అయితే, వీరిద్దరికీ ఓటింగ్ పర్సెంటేజ్ మాత్రం చాలా తేడా ఉంది.

ఆ తర్వాత మహేష్ విట్టా, హమీదా, అషూరెడ్డి కూడా సేఫ్ జోన్ లోనే ఉన్నారు. ఇక మిగిలిన వాళ్లు మాత్రం డేంజర్ జోన్ లోనే ఉన్నారు. అజయ్, మిత్రా శర్మా , ముమైత్ ఖాన్, ఇంకా స్రవంతి ఈ నలుగురు డేంజర్ జోన్ లోనే ఉన్నారు. మరి వీరిలో డబుల్ ఎలిమినేషన్ జరిగితే మాత్రం ఖచ్చితంగా మేల్ అండ్ ఫిమేల్ ఇలా చేస్తారనే అనుకుంటే అజయ్, ఇంకా స్రవంతి ఇద్దరూ వెళ్లే అవకాశం కనిపిస్తోంది.

ఒకవేళ ముమైత్ ఖాన్ , స్రవంతిలని బయటకి పంపించేసినా కూడా ఆశ్చర్యపోవక్కర్లేదు. బిగ్ బాస్ డబుల్ ఎలిమినేషన్ లో ట్విస్ట్ ఇవ్వాలి అనుకుంటే మాత్రం మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా చేస్తారు. అంటే, నాగార్జున ఆదివారం ఎపిసోడ్ కంటే ముందే ఈ ఎలిమినేషన్ అనేది జరిగిపోతుంది. అయితే, ఇందులో నామినేషన్స్ లో ఉన్నవారికి సంబంధం ఉండదు. హౌస్ మొత్తం ఏకాభిప్రాయంతో ఎవరినైనా సరే హౌస్ నుంచీ పంపించేయచ్చు. నిజానికి చాలా సీజన్స్ లో ఇలా చేసి వారిని సీక్రెట్ రూమ్ లో పెట్టారు.

కానీ, ఇప్పుడు డబుల్ ఎలిమినేషన్ లో భాగంగా ఇలా మిడ్ వీక్ ఎలిమినేషన్ చేసే ఛాన్స్ కనిపిస్తోంది. మిడ్ వీక్ ఎలిమినేషన్ జరిగితే హౌస్ లో మెజారిటీ ఓటింగ్ అనేది శివ లేదా బిందులకి పడే అవకాశం ఉంది. లేదా, మిత్రా శర్మాకి కూడా పడొచ్చు. మిత్రా శర్మా హౌస్ లో అందర్నీ ఇరిటేట్ చేస్తోందని అందరూ మెజారిటీ ఓట్లు వేశారు కాబట్టి, ఈవారం మిడ్ వీక్ ఎలిమినేషన్ పెడితే మాత్రం ఖచ్చితంగా మిత్రాశర్మా బయటకి వచ్చేస్తుంది. ఒకవేళ అదే జరిగితే మాత్రం అది ఖచ్చితంగా అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అవుతుంది.

ఎందుకంటే, ప్రజల ఓట్లతో సంబంధం లేకుండా ఇలా బిగ్ బాస్ హౌస్ నుంచీ ఒకరిని హౌస్ మేట్స్ పంపించేస్తే ఇక ఆడియన్స్ ఓట్లకి వాల్యూ ఇచ్చినట్లు ఎందుకు అవుతుంది. దీన్ని సోషల్ మీడియాలో చాలామంది వ్యతిరేఖిస్తారు. కాబట్టి ఈసారి మిడ్ వీక్ ఎలిమినేషన్ అనేది ఎలా చేస్తారు అనేది ఆసక్తికరం. చూద్దాం ఏం జరగబోతోంది అనేది. ఈవారమే చేస్తారా ? లేదా వచ్చేవారం ఈ ఎలిమినేషన్ చేస్తారా అనేది ఇప్పుడు ఇంట్రస్టింగ్ గా మారింది. అదీ మేటర్.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus