మొత్తానికి RRR సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుని రాబోయే సినిమాలో కూడా మరింత ధైర్యాన్ని ఇచ్చింది అనే చెప్పాలి. దాదాపు కరోనా భయమైతే జనాల్లో పూర్తిగా పోయింది. ఇక నిర్మాతలు స్వేచ్ఛగా సినిమాను విడుదల చేసుకునే అవకాశం లభించింది. ఇక రానున్న రోజుల్లో RRR హడావిడి తగ్గి మిగతా సినిమా హడావిడి మొదలయ్యేది అవకాశం ఉంది. కేవలం థియేటర్లోనే కాకుండా ఓటీటీ లో కూడా సరికొత్త సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
ముందుగా జనవరి 8వ తేదీన వరుణ్ తేజ్ గని సినిమా భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. బాక్సింగ్ నేపధ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను అల్లు అర్జున్ సోదరుడు అల్లు బాబీ నిర్మించగా కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి డైరెక్ట్ చేశాడు. ఈ సినిమాలో ఉపేంద్ర సునీల్ శెట్టి జగపతిబాబు ఇలా ప్రముఖ నటులు ఉండటంతో కొంత పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అయ్యాయి.
ఇక కాంట్రవర్సీ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ మరొక డిఫరెంట్ రొమాంటిక్ క్రైమ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అప్సర రాణి నైనా గంగోలి నటించిన డేంజరస్ సినిమాలో ఇద్దరు స్వలింగ సంపర్కుల హీరోయిన్స్ ప్రేమ ప్రయాణంలో ఎలా మునిగి తేలారు అనే పాయింట్ను వర్మ చాలా రొమాంటిక్ గా చుపించబోతున్నాడు. ఈ నెల 8న రాబోయే ఈ సినిమాను తెలుగులో మా ఇష్టం అనే టైటిల్ తో విడుదల చేస్తున్నారు.
రాజ్ తరుణ్ వర్ష బొల్లమ్మ నటించిన స్టాండప్ రాహుల్ సినిమా గత నెల 18న విడుదల కాగా ఇప్పుడు ఆహాల ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ లో ఏప్రిల్ 8 తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో
మర్డర్ ఇన్ అగోండా (హిందీ),
నారదన్ (మలయాళం) చిత్రాలు అదే రోజు రనుండగా